Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chiranjeevi: పోలింగ్ వేళ చిరంజీవి మరో ట్విస్ట్-నో పిఠాపురం- రాజకీయాలకు అతీతంగా..!

ఏపీలో ఎల్లుండి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఇవాళ్టితో ప్రచారపర్వం ముగియబోతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం కోసం వదిన సురేఖ, ఆమె కుమారుడు రామ్ చరణ్ ఇవాళ అక్కడికి వెళ్లారు. చిరంజీవి కూడా చివరి రోజు వస్తారని భావించినా ఆయన మాత్రం వెనక్కి తగ్గారు. దీనిపై ఇవాళ క్లారిటీ ఇచ్చారు.

పిఠాపురంలో ప్రచారానికి తాను వెళ్తున్నాననేది కేవలం మీడియాలో జరిగిన ప్రచారం మాత్రమేనని చిరంజీవి తేల్చిచెప్పేశారు. పిఠాపురం వెళ్లే ఉద్దేశం లేదన్నారు. ఇప్పటికే తాను పిఠాపురంలో పోటీ చేస్తున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఓటేయాలని వీడియో విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. కాబట్టి ఇక పిఠాపురం వెళ్లేది లేదన్నారు. అదే సమయంలో తన రాజకీయాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

megastar Chiranjeevi another twist ahead of ap election polling says want to be beyond politics


తాను రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకుంటున్నట్లు చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీని స్థాపించి అనంతరం దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి ఇప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతున్న చిరంజీవి.. క్రియాశీలకంగా మాత్రం వ్యవహరించడం లేదు. అదే సమయంలో జనసేన పార్టీని నడుపుతున్న తమ్ముడు పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ఇప్పటివరకూ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కానీ ఫైనల్ గా తాను రాజకీయాలకు అతీతమన తేల్చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+