చిరంజీవి సార్... దయచేసి ఇకనుంచి వాటిజోలికెళ్లొద్దు!!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం భోళా శంకర్. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ టాక్ తో ఈ సినిమా మూడురోజులు కూడా నిలబడటం కష్టమేనని అభిమానులే కామెంట్ చేస్తున్నారు. మెహర్ రమేష్ తో సినిమా ప్రకటించగానే మొదటి నుంచి అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు కానీ చిరంజీవి రమేష్ పై నమ్మకంతో ముందుకు వెళ్లారు. బిల్లా, శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు ఇచ్చిన మెహర్ భోళాశంకర్ ను బాగా తీస్తాడని ఎవరూ ఆశలు పెట్టుకోలేదు.
వాల్తేరు వీరయ్య కంటే ముందుగానే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఆ దర్శకుడుమీద, కథమీద నమ్మకం ఉంచి చిరంజీవి అది చేశారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా 200 రోజుల వేడుకను కూడా జరుపుకుంది. చిరంజీవి నమ్మకం ఉంచారు కాబట్టి సినిమా బాగానే వస్తోంది కాబోలు అని మరోవైపు నమ్మకంతోనే అభిమానులు ఎదురు చూశారు.

కానీ వారి ఆశను ఈ సినిమా అడియాసలు చేసింది. రీమేక్ సినిమాలు మెగా హీరోలకు నిరాశనే మిగిలిస్తున్నాయి. చిరంజీవి గాడ్ ఫాదర్, భోళాశంకర్.. రెండూ రీమేక్ సినిమాలే. రెండూ ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. పవన్ కల్యాణ్ కూడా వకీల్ సాబ్, భీమ్లానాయక్, బ్రో రీమేక్స్ చేశారు. మొదటి రెండు సినిమాలు యావరేజ్ కాగా, బ్రో ఫలితం అందరికీ తెలిసిందే.
రామ్ చరణ్ ధ్రువ తీయగా అది హిట్ గా నిలిచింది. రీమేక్ సినిమాలు చేయొద్దని, స్ట్రైట్ కథతో సినిమాలు తీయాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆచార్య భారీ డిజాస్టర్ అనుకుంటే.. దాన్ని మించిన డిజాస్టర్ గా భోళాశంకర్ నిలవబోతోందని మెగా అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అభిమానుల్లో జోష్ తెచ్చేందుకు చిరంజీవి తన తర్వాత సినిమాను ఎవరితో చేస్తారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications