చిరంజీవి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ వినీలాకాశంలో ఒక ధ్రువతారలా వెలుగొందుతున్న వ్యక్తి. ఆయనకు ఇతర దేశాలకు చెందిన కార్లంటే మహా మోజు. ప్రపంచ మార్కెట్ లో అత్యంత ఖరీదైన కార్లను తయారుచేసే రోల్స్ రాయిస్ కంపెనీకి చెంది ఫాంటమ్ చిరంజీవి దగ్గర ఉంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఈ కారు ఉంది. దీని ఖరీదు రూ.8 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. చిరంజీవి 53వ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ తన తండ్రికి పుట్టినరోజు కానుకగా ఇచ్చారు. దీని పనితీరు చాలా బాగుంటుంది.
చిరంజీవి గ్యారేజ్ లో రెండు టయోటా ట్యాండ్ క్రూయిజర్లు ఉన్నాయి. ఇందులో ఒకటి ఇండియా మార్కెట్ లోకి ఇది విడుదల కాకముందే దిగుమతి చేసుకున్నారు. ఈ తరహా కార్లను రాజకీయ నాయకులు ఎక్కువగా ఉపయోగిస్తారు. చాలామంది సెలబ్రిటీలు ఈ కారును కొనుగోలు చేశారు. రూ.1కోటి కంటే ఎక్కువే. ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వోగ్ కూడా మెగాస్టార్ దగ్గర ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోగ్ కారుకన్నా పాత కారు అత్యంత శక్తివంతమైన ఇంజన్ ను కలిగివుంటుంది. దీని ధర కూడా రూ.కోటిపైనే ఉంది.

చిరుకు హైదరాబాద్ లో అత్యంత విశాలమైన, విలాసవంతమైన బంగ్లా ఉంది. రూ.30 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి చెందిన ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూపొందించింది. టెన్నిస్ కోర్టు, ఔట్ డోర్ ఫూల్, ఫిష్ పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ ఉన్నాయి. ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. 1988లో తన సోదరుడు నాగబాబుతో కలిసి అంజన ప్రొడక్షన్స్ హాస్ స్థాపించారు. తెలుగులో ఇది ప్రసిద్ధ బ్యానర్ గా పేరుపొందింది. మొత్తంమీద మెగాస్టార్ ఆస్తుల విలువ రూ.1650 కోట్లు అని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications