బాబు డిఫెన్స్‌లో పడ్డారు, కానీ జగన్ మమ్మల్ని దెబ్బతీశారు: మేకపాటి సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu
  చెప్పి జగన్ మబాబు డిఫెన్స్‌లో పడ్డారు, కాల్చివేయాలనిమ్మల్ని దెబ్బతీశారు: మేకపాటి సంచలనం | Oneindia

  అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు.

  జగన్ తీరుతో సొంత పార్టీలో అసంతృప్తి, మాట్లాడేందుకు లోకేష్ రెడీ

  అప్పుడే రివర్స్ అయింది

  అప్పుడే రివర్స్ అయింది

  అప్పటి వరకు నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు తమ వైపే ఉన్నట్లుగా కనిపించాయని మేకపాటి రాజమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కానీ జగన్ వ్యాఖ్యల అనంతరం కొంత రివర్స్ అయిందని తెలిపారు.

  నంద్యాల ఓటమిపై అందరి వేళ్లు జగన్ వైపే

  నంద్యాల ఓటమిపై అందరి వేళ్లు జగన్ వైపే

  నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో అందరి వేళ్లు కూడా జగన్ వైపు చూపిస్తున్నాయి. పలువురు రాజకీయ విశ్లేషకులతో పాటు టిడిపి నేతలు కూడా జగన్ వ్యాఖ్యలు తమకు లాభించాయంటున్నారు. వైసిపి నేతలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

  సీనియర్లు కూడా

  సీనియర్లు కూడా

  వైసిపి సీనియర్ నేతలు కూడా ఇప్పుడు జగన్ వల్ల కూడా ఓటమి కలిగిందని చెవులు కొరుక్కుంటున్నారని తెలుస్తోంది. చంద్రబాబును కాల్చివేయాలన్న జగన్ వ్యాఖ్యలు తమను దెబ్బతీశాయని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం అంటున్నారు.

  మేకపాటి వ్యాఖ్యలు ఇలా..

  మేకపాటి వ్యాఖ్యలు ఇలా..

  నేను జగన్ స్పీచ్‌ను చూశానని, ఆయన ప్రసంగం తనను కట్టి పడేసిందని మేకపాటి చెప్పారు. అలాగే, శిల్పా చక్రపాణి రెడ్డిచే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించడం కూడా మంచి నిర్ణయమని చెప్పారు. అది ప్రజల్లోకి బాగా వెళ్లిందని, అది పార్టీకి ఎంతో ప్లస్ అని చెప్పారు.

  చంద్రబాబు డిఫెన్స్‌లో పడ్డారని భావించా, కానీ

  చంద్రబాబు డిఫెన్స్‌లో పడ్డారని భావించా, కానీ

  జగన్ అద్భుత ప్రసంగం, శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామాతో టిడిపి, చంద్రబాబు డిఫెన్స్‌లో పడ్డారని భావించామని మేకపాటి అన్నారు. చక్రపాణి రాజీనామా చాలా మంచి నిర్ణయం అన్నారు. కానీ ఆ తర్వాత చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలకు టీవీల్లో విమర్శలు కనిపించాయని చెప్పారని తెలుస్తోంది. అప్పటి వరకు తమదే గెలుపు అనుకున్న తమకు నిరాశ ఎదురయిందని, అప్పటి వరకు తాము పడ్డ కష్టం నిష్ఫలం అయిందని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  YCP chief Jaganmohan Reddy had very high hopes on Nandyal by-poll. He stayed in Nandyal for two weeks and relentlessly campaigned. However, his party candidate suffered a humiliating defeat, and many political analysts blamed Jagan for the defeat. Do YCP seniors also feel that Jagan's alleged loudmouth is the reason why YCP lost the by-poll?

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి