పెద్దిరెడ్డిని కలిసింది నిజమే కానీ.. ! వైరల్ వీడియోపై కొలికపూడి క్లారిటీ..!
ఏపీలో ఇవాళ టీడీపీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజమండ్రి ఎయిర్ పోర్టులో కలిసినట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అయింది. ఇందులో ఎయిర్ పోర్టులో నుంచి బయటికి వస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కొలికపూడి శ్రీనివాస్ పలకరిస్తున్నట్లుగా ఉంది. దీంతో ఇప్పటికే టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ మార్పు ఖాయమన్న ప్రచారం జరిగింది.
దీనిపై తిరువూరులోని ఎమ్మెల్యే కొలికపూడి కార్యాలయం స్పందించింది. వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కొలికపూడి కలిసింది నిజమే కానీ ఆ సందర్బం వేరని క్లారిటీ ఇచ్చింది. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా తాను రాజమండ్రి ఎయిర్ పోర్టులో పెద్దిరెడ్డిని కలుసుకోలేదని ఆయన తెలిపారు. అలాగే ఈ వీడియోలో ఉన్న వాస్తవం ఏంటో కూడా ఎమ్మెల్యే కొలికపూడి వెల్లడించారు.

మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజు తాను కుటుంబంతో తిరుమలకు బయలుదేరానని కొలికపూడి తెలిపారు. హైదరాబాద్ నుండి తిరుపతి ఇండిగో విమానంలో వెళ్ళినప్పుడు రేణిగుంట విమానాశ్రయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలకరించానని కొలికపూడి క్లారిటీ ఇచ్చారు. ఆయన కూడా పలకరించి వెళ్లిపోయారన్నారు. ఇదంతా 30 సెకన్ల లోపు జరిగిందన్నారు. అయితే దీనిపై ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వ్యాఖ్యానించుకోవచ్చని తెలిపారు. దీన్ని కొన్ని చానల్స్ రాజమండ్రిలో కలిసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకొని ప్రచురిస్తే మంచిదని ఎమ్మెల్యే తెలిపారు.












Click it and Unblock the Notifications