వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్ నో చెప్పినా: మీరూ సీఎంగా చేశారు.. మరో సీఎం బాధ అర్థం చేసుకోండి.. మోడీకి ముఖం మీదే చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విభజన సమస్యలను ప్రస్తావించారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీఎం ప్రసంగాన్ని సమయం పూర్తయిందంటూ అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ చంద్రబాబు ఇరవై నిమిషాల పాటు ప్రసంగించారు.

Recommended Video

చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగిన అంబటి రాంబాబు

ఢిల్లీలో హైడ్రామా: చంద్రబాబు-కేజ్రీవాల్‌లో ఓ కామన్ విషయం... సీఎం లేఖకు దిమ్మతిరిగే కౌంటర్!ఢిల్లీలో హైడ్రామా: చంద్రబాబు-కేజ్రీవాల్‌లో ఓ కామన్ విషయం... సీఎం లేఖకు దిమ్మతిరిగే కౌంటర్!

13 పేజీల నివేదికను సమావేశంలో ఆయన చదివి వినిపించారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన లేవనెత్తిన డిమాండ్లు, ప్రతిపాదనలు ఇవే.. రాష్ట్ర రెవెన్యూ లోటును భర్తీ చేయాలి. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంకు వెంటనే నిధులను మంజూరు చేయాలి. అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. విభజన హామీలన్నింటినీ అమలు చేయాలి. పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలి.

Mine is a Special State With Special Problems: Chandrababus Retort at Being Cut Short by Rajnath

రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు రూ. 350 కోట్లు విడుదల చేయాలి. గృహ నిర్మాణం, వైద్యానికి ఎక్కువ నిధులు ఇవ్వాలి. రైతులు చెమటోడ్చి పండించుకున్న పంటకు కనీస మద్దతు ధరను ప్రకటించాలి. 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవడం సరికాదు. విధి విధానాలను మార్చండి.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలతో రాష్ట్రాలపై పెనుభారం పడింది.

మీరు (మోడీ) కూడా ముఖ్యమంత్రిగా పని చేశారని, మరో సీఎం పడుతున్న బాధను అర్థం చేసుకోవాలని ప్రధానమంత్రిని ఉద్దేశించి చంద్రబాబు సూటిగా వ్యాఖ్యానించారని తెలుస్తోంది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో నీతి ఆయోగ్ సమావేశం గంభీరంగా మారిపోయింది.

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu was locked in an interesting exchange with Union minister Rajnath Singh at a Niti Aayog meeting on Sunday, where the former reiterated his demand for special status to his state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X