ప్ర‌జ‌ల నాడి ల‌గ‌డ‌పాటికి ఏం తెలుసు : ఆయ‌న్ను న‌మ్మి కోట్లు న‌ష్ట‌పోయారు: మ‌ంత్రి అయ్య‌న్న ఫైర్..!

ఆంధ్రా అక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పైన టీడీపీ నుండే విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ఆయ‌న‌కు అస‌లు ప్ర‌జ‌ల నాడి ఏం తెలుసంటూ టీడీపీ మంత్రులే ప్ర‌శ్నిస్తున్నారు. ఆయ‌న్ను న‌మ్మి తెలంగాణ‌లో కోట్లాది రూపాయాలు న‌ష్ట పోయార‌ని ఆరోపిస్తున్నారు. అనేక మంది స‌ర్వ‌నాశ‌న‌మై పోయార‌ని మంత్రి అయ్య‌న్న పాత్రుడు ఫైర్ అయ్యారు. ఇప్పుడు మంత్రి ఆయ్య‌న్న వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ల‌గ‌డ‌పాటిని న‌మ్మి నాశ‌న‌మైపోయారు..
ఏపీలో టీడీపీ గెలుపు ఖాయ‌మ‌ని ఎగ్జిట్ పోల్స్ స‌ర్వే బ‌య‌ట పెట్టిన మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పైన టీడీపీ సీనియ‌ర్లే మండి ప‌డుతున్నారు. మంత్రి అయ్య‌న్న పాత్రుడు ల‌గ‌డ‌పాటి స‌ర్వేల గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని తెలిపారు. లగడపాటి మాట నమ్మి సర్వనాశనమై పోయామని తనతో చాలా మంది చెప్పారన్నారు. ప్రజల నాడీ లగడపాటికి ఏం తెలుసు అని ప్రశ్నించారు. తాజా ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ల‌గ‌డ‌పాటి చెప్పినా..అయ్య‌న్న పాత్రుడు ఈ ర‌కంగా వ్యాఖ్య‌లు చేయ‌టం ఇప్పుడు రాజ‌కీయంగా క‌ల‌క‌లానికి కార‌ణ‌మ‌య్యాయి.

Minister Ayyanna fire on Lagadapati : Rajagopal do not know people pulse..

ప్ర‌జ‌ల నాడి తెలిసిన వాడు చేయాలి..
ఎవ‌రైనా స‌ర్వేలు చేయాలంటే ప్రజల నాడీ తెలిసినోడు ఎగ్జిట్‌ పోల్‌ చేయాని మంత్రి అయ్య‌న్న వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ సర్వేలు చేసేస్తే ప్రమాదం ఉందని ల‌గ‌డ‌పాటిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్‌ ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్‌తో ప్రజలు కొన్ని కోట్ల రూపాయాలు నష్టపోయారని చెప్పుకొచ్చారు. వెయ్యి కోట్ల రూపాయల వరకు పందేలు కాశారనని... వాళ్లంతా సర్వనాశనమయ్యార‌ని అయ్యన్నపాత్రుడు వివ‌రించారు.

ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత టీడీపీ ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పింది ల‌గ‌డ‌పాటి ఒక్క‌రే. జాతీయ స‌ర్వే సంస్థ‌లు అన్నీ వైసీపీకి అనుకూలంగా ఉంటే ల‌గ‌డ‌పాటి మాత్రం టీడీపీ గెలుపు ఖాయ‌మ‌ని చెప్పారు. ఇప్పుడు ల‌గ‌డ‌పాటి స‌ర్వే మీదే టీడీపీ నేత‌లు ఆశలు పెట్టుకున్నారు. ఇక‌, ఇప్పుడు అయ్య‌న్న లాంటి వారి ఎందుకు ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారో..దీని వెనుక కార‌ణ‌మేంటో ఈనెల 23న తేల‌నుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+