జన్మలో చూడలేదు: తుఫాన్‌పై అయ్యన్నపాత్రుడు

విశాఖపట్నం: సకాలంలో ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవడంవల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగామని మంత్రి అయ్యన్న పాత్రుడు చెప్పారు. తమ జన్మలో ఇంతటి విపత్తును కనీవినీ ఎరుగలేదని ఆయన అన్నారు. మీడియా కూడా గత మూడు రోజులుగా రాబోయే విపత్తు గురించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేయడంతో ప్రజల ప్రాణాలకు నష్టం క లగకుండా చూడగలిగామని అన్నారు.

మంత్రి సోమవారం ఉదయం తుపాను బీభత్సానికి బాగా దెబ్బ తిన్న జాలరిపేటలో పర్యటించారు. అధికారులు కూడా ఆయనతో పాటు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఏయే సహాయ చర్యలు తక్షణం తీసుకోవాలో వారు స్థానికులతో మాట్లాడి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకున్నారు.

Minister Ayyanna Patrudu visits cyclone hit area

ఆంధ్ర విశ్వవిద్యాలయంపై ప్రభావం

విశాఖలో తుఫాన్‌ ఆంధ్రా యూనివర్సిటీపై తీవ్ర ప్రభావం చూపింది. ఇంత వరకూ పచ్చదనంతో కళకళలాడే ఏయూ ప్రాంగణలో చెట్లన్నీ కూలిపోయాయి. పలు భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఏయూ మహిళా హాస్టల్‌ భవనం కూలింది. ఐతే ఈ సంఘటనలో ఎవరికీ ప్రమాదం జరగక పోవడంతో విద్యార్థులు, యూనివర్సిటీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విశ్వవిద్యాలయంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడానికి ఐదు రోజులు పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

కరెంట్ వ్యవస్థ అస్తవ్యస్తం

తుఫాను దెబ్బకు విశాఖలో విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దాదాపు 90 శాతం విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. చెట్లు విరిగిపడడంతో ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. గాజువాక పెద్ద బోడిపల్లి వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ కూలిపోవడంతో ఏటీఎం ధ్వంసమైంది. విద్యుత్‌ లేక దుకాణాల తెరవకపోవడంతో ప్రజలు నిత్యావసరాలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాల్తేరు డివిజన్‌ పరిధిలో రైల్‌ లైన్లకు విద్యుత్‌ సరఫరా చేసే పవర్‌ గ్రిడ్‌ను మూసివేశారు. దీంతో ఈ మార్గంలో రైలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యుత్‌ సరఫరా లేకపోవటంతో నీటి సరఫరా కూడా నిలిచిపోయింది.

రేడియోలే దిక్కు

శనివారం సాయంత్రం నుంచి విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో విశాఖ నగరం అంధకారంలో మునిగిపోయింది. ఇన్వర్టర్లు కూడా పనిచేయడం మానేశాయి. కేబుల్‌ ప్రసారాలు నిలిచిపోయాయి.దీంతో నగరవాసులు సమాచారం తెలుసుకోవడానికి రేడియోల మీదే ఆధారపడుతున్నారు. సెల్‌ఫోన్‌ టవర్లు నేలకూలి సమాచార వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఉదయం 10 గంటల వరకు పనిచేసిన సెల్‌ ఫోన్లు తర్వాత మూగబోవడంతో విశాఖలో ఉన్న తమ బంధువుల సమాచారం తెలియక ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+