జగన్ మీద కోపంతో చెబుతున్నారేమో అనుకున్నా?

తాను కూడా షిఫ్ట్ అవుతున్నానంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసిన తర్వాత కొత్తగా చర్చలు పెట్టడం అనవసరమని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలను రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ వేరు.. రికార్డింగ్ వేరు అన్నారు. థర్డ్ పార్టీ రికార్డింగ్ చేస్తే దానికి, ప్రభుత్వానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. పార్టీ మారాలి అనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లొచ్చని, కానీ నిందలు వేసి వెళ్లడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తుకు విశాఖపట్నం వేదిక కాబోతోందన్నారు. మార్చిలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, జీ20 సదస్సులు చాలా కీలకమన్నారు. కొత్త బిల్లు ప్రవేశపెట్టి విశాఖపట్నానికి రాజధానిని తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు. విశాఖపట్నం రాజధాని అని, త్వరలోనే తాను కూడా షిఫ్ట్ అవుతున్నానంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసిన తర్వాత కొత్తగా చర్చలు పెట్టడం అనవసమరన్నారు. రాజధానికి కావల్సిన అన్ని మౌలిక సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయని, పరిశ్రమలకు అవసరమైన వర్క్ ఫోర్ తోపాటు పారిశ్రామిక కారిడార్లలో 50వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు.

minister gudivada amarnath counter to nellore rural mla kotamreddy sridhar reddy

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో తాను ఎన్నో అవమానాలు భరించానని, కానీ తన ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఫోన్ ట్యాప్ చేస్తారా? అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ పై తనకు స్పష్టమైన సాక్ష్యం దొరికిందని, అవమానాలు జరిగేచోట ఉండాల్సిన అవసరం లేదన్నారు. తన దగ్గరున్న ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేయాలనుకుంటున్నానని, అది పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడివుందన్నారు. తన ఫోన్‌ ట్యాప్‌ అవుతోందని 4 నెలల ముందే ఓ ఐపీఎస్‌ అధికారి చెప్పారని, ముఖ్యమంత్రిపై కోపంతో చెప్పారేమోనని అనుకున్నానని, కానీ కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్‌ అధికారులు తనపై నిఘా పెట్టారని శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ నుంచి పోటీచేయడానిక తన మనసు అంగీకరించడంలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+