బర్రెలక్కతో కూడా పోటీపడలేకపోయిన పవన్ సేన.. ఏపీలో తెలంగాణా ఫలితాలే రిపీట్!!
తెలంగాణ రాష్ట్రంలో బిజెపితో కలిసి ఎన్నికలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ఎక్కడా, డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయారు. దీంతో పవన్ కళ్యాణ్ ను, జనసేన పార్టీని ఏపీలోని వైసిపి మంత్రులు, నేతలు ఆడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు మళ్లీ ఏపీలో రిపీట్ అవుతాయని జనసేనను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వింత రాజకీయాలు చేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఇక తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభ ను ఉద్దేశించి మాట్లాడుతూ విశాఖలో పవన్ కళ్యాణ్ సభ ఏపీలో జనసేనపార్టీకి ఎన్నికలలో ఫలితం ఏవిధంగా వస్తుందో మరోసారి నిరూపించిందని ఎద్దేవా చేశారు. విశాఖ అన్నిరకాలుగా మేలు చేసింది అని చెప్పే మీరు విశాఖ రాజధాని అంశాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కు మతిభ్రమించింది అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ప్రపంచ స్థాయిలో విశాఖ నగర అభివృద్ధి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తుంటే పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తెలంగాణలో బర్రెలక్కతో కూడా పవన్ సేన పోటీ పడలేక పోయిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
అసలు పవన్ కళ్యాణ్ కు ఏపీకి సంబంధం ఏమిటో చెప్పాలని ప్రశ్నించిన ఆయన మీరు ఏపీలో ఎంత కాలం ఉన్నారు అంటూ నిలదీశారు. మీ స్థిర నివాసం తెలంగాణ.. అక్కడ మీ బలమేమిటో ఎన్నికల్లో కనిపించిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ మీ నియోజకవర్గం ఏంటో చెప్పగలరా అంటూ ప్రశ్నించిన గుడివాడ అమర్నాథ్ మీ శంకర్ గౌడ్ కు ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పాలంటూ నిలదీశారు.

ఎక్కడికి వెళితే అక్కడ ఇది మన నియోజకవర్గం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అసలు అబ్రహం లింకన్ కు మీకు లింక్ ఏమిటో చెప్పాలన్నారు. మీది చంద్రబాబు లింకన్ సంబంధం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అబ్రహం లింకన్ గురించి మాట్లాడే స్థాయి మీకు ఉందా అంటూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు.
తెలంగాణలో ఒక పార్టీతో దోస్తానా ఆంధ్రలో మరో పార్టీతో దోస్తానా అంటూ పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో బిజెపి ని నాశనం చేశారు. ఇక్కడ ఏ పార్టీని నాశనం చేయడానికి రెడీ అయ్యారో అందరికీ తెలుసన్నారు. పవన్ కళ్యాణ్ ది పొలిటికల్ కాంట్రాక్ట్ అని, అధికారికంగా బిజెపితో అనధికారికంగా టిడిపితో పవన్ సంబంధం కొనసాగుతుందని మండిపడ్డారు.
-
పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! -
23 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున..!! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం












Click it and Unblock the Notifications