Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూరు రేవ్ పార్టీ వార్తలపై స్పందించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ఈ పార్టీలో కన్నడ, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది నటీనటులు, రాజకీయ ప్రముఖులు ఉన్నారంటూ ప్రస్తుతం వార్తలు హల్చల్ చేస్తున్నాయి. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఆదివారం రోజున అర్ధరాత్రి రేవ్ పార్టీ జరిగింది.

రేవ్ పార్టీలో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు
జి ఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరగగా ఆ పార్టీ పైన పోలీసులు దాడి చేశారు. ఈ పార్టీలో వంద మందికి పైగా పట్టుబడినట్లు సమాచారం. అందులో పాతిక మందికి పైగా సినీ నటులు, అమ్మాయిలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది, అంతేకాదు ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరకగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ రేవ్ పార్టీలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న కారు ఉండటంతో ఆయనపైన దుమారం రేగింది.

Minister Kakani Govardhan Reddy reacted to the news of the Bangalore rave party

రేవ్ పార్టీలో తన పేరుపై స్పందించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి
బెంగళూరు రేవ్ పార్టీలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన వారు ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంతో తాజాగా ఆయన స్పందించారు. బెంగళూరు రేవ్ పార్టీలో తన పేరు తెర మీదికి రావడం వెనక కుట్ర దాగుందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందన్న నెపంతో తనపై బురద చల్లడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారమేనని ఆయన తెలిపారు.

ఇదంతా వాళ్ళ కుట్ర
రేవ్ పార్టీలో పట్టుబడ్డ కారుతో కానీ, ఆ కారు ఓనర్ తో కానీ, ఆ కారులో ప్రయాణించిన వారితో కానీ తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆ కారు రిజిస్ట్రేషన్ విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పేరుతో ఉందని అతను ఎవరో కూడా తనకు తెలియదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీనేతలు, వాళ్ళ అనుకూలమీడియా తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

పోలీసులకు ఫిర్యాదు చేశానన్న మంత్రి కాకాణి
కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్స్ వినియోగించిన వారు జిరాక్స్ కాపీలను వినియోగించారని నా ప్రమేయం లేకుండానే వారు నా పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్స్ వినియోగించారని, దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. బెంగళూరు నార్కోటిక్ పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్న ఆయన సమగ్ర దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.

తనకేం సంబంధం లేదన్న మంత్రి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించనున్నట్టు స్పష్టంగా అర్థమయి ఓటమి భయంతోనే తన మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని టిడిపి పైన మంత్రి కాకాణి మండిపడ్డారు.తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని మరోమారు స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+