ఉండవల్లి సూచన, బాబు ప్రభుత్వం చెప్పింది చేస్తా!: బీజేపీ మంత్రి

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి దీక్ష చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం నాడు సూచించారు. గతంలో కూడా మోడీ గుజరాత్ అవసరాలకు ఇలాగే వ్యవహరించారని ఆరోపించారు.

హోదాపై మాట్లాడలేను: కామినేని

ప్రత్యేక హోదా విషయమై తాను మాట్లాడలేనని మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస రావు ఆదివారం నెల్లూరు జిల్లాలో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: బీజేపీ-టీడీపీ స్నేహం కొనసాగదు, అందుకే మోడీ శత్రువు బాబు: జేసీ సంచలనం

Minister Kamineni srinivas interesting comments

ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. టిడిపి - బిజెపి మైత్రిని దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు. బిజెపి - టిడిపి మైత్రి ఇలాగే కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు బంద్‌కు పిలుపివ్వాలి: కొణతాల

ప్రత్యేక హోదా విషయమై సీఎం చంద్రబాబు బందుకు పిలుపునివ్వాలని కొణతాల రామకృష్ణ సూచించారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా పార్టీలు బందుకు పిలుపునిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ నెల 2వ తేదీన లేక ప్రభుత్వం ఆధ్వర్యంలో మరో తేదీన బందుకు పిలుపునివ్వాలని చెప్పారు. బందులు, నిరసనలు జరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Kamineni Srinivas Rao interesting comments.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి