ఏపీలో ఆ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా అద్భుత స్పందన!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన పథకాలను ఒక్కొక్కటిగా మాలు చేస్తుంది. ఇక దీపావళి రోజున ప్రారంభించిన దీపం -2 పధకం రాష్ట్ర వ్యాప్తంగా ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన ప్రజల నుండి ముఖ్యంగా మహిళల నుంచి వచ్చింది.

అనకాపల్లిలో దీపం 2 పథకం లబ్దిదారుని ఇంటికి వెళ్ళిన మంత్రి
ఇక ఇదే విషయాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు వెల్లడించారు.ఈ రోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామం రామాలయం వీధిలో దీపం-2 పథకం క్రింద అనకాపల్లి శాసనసభ్యలు కొనతాల రామకృష్ణతో కలిసి ఆయన నేరుగా లబ్ధిదారుడైన కందులా ఈశ్వర్ రావు గృహానికి వెళ్లి గ్యాస్ స్టవ్ వెలిగించి టీ చేసి ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి టి త్రాగానన్నారు.

Minister Nadendla manohar happy about free gas cylinders scheme deepam 2

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం
గతంలో గ్యాస్ స్టవ్ లేని సమయంలో కట్టెలు తెచ్చి, ఆరబెట్టి, ఇలా ఎన్నో కస్టాలు పడేవారమని చెప్పినట్లు ఆయన తెలిపారు. నేడు ఫోన్ చేస్తే ఇంటికే గ్యాస్ వస్తుందన్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు గా 1 కోటి 55 ఏబై ఐదు లక్షల గ్యాస్ కనెక్ష న్లు ఉన్నాయన్నారు.

దీపం సబ్సిడీ నలభై గంటల్లోనే లబ్దిదారుల ఖాతాలో
అందులో 81 లక్షల దీపం -2 పధకం క్రింద ఉచిత గ్యాస్ సిలిండర్లు బుక్ చేసకున్నారు ఆని తెలిపారు.ప్రతి ఇంటికి దీపం -2 పధకం క్రింద సంత్సరనికి 3 సిలిండర్ల చొప్పున ప్రతి ఒక్క సిలిండరకు 850 రూపాయలు సబ్సిడీ 48 గంటల్లోనే లబ్ధిదారుల ఖాతాలో పడే విదంగా ఏర్పాట్లు చేసామని అన్నారు.

చాలా పారదర్శకంగా పథకాల అమలు
అలాగే అనకాపల్లి జిల్లాలో 2 లక్షల 20 వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని అందులో 1 లక్ష 75 వేల మంది బుక్ చేసుకున్నారు ఆని, ఈ పధకం చాలా పారదర్శకంగా ఎటువంటి అవినీతి, ఆలసత్వం లేకుండా అమలు చేస్తున్నామన్నారు.సంత్సరానికి 2 వేల 8 వందల 40 కోట్ల రూపాయలు సూపర్ 6 లో భాగంగా ఈ పధకానికి ఇస్తున్నాము అన్నారు.

దీపం పథకానికి నిబంధనలు ఇవే
ప్రభుత్వం నుంచి మూడే నిబంధనలు పెట్టామని, అందులో ఒకటి గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి. రెండు ఆధార్, మూడు రైస్ కార్డు ఉండాలి అన్నారు. పై మూడు ఉండి దీపం పథకం రాకపోతే 1967 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి పిర్యాదు చెయ్యాలని వెంటనే అధికారులు స్పందిస్తారన్నారు. జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్,జాయింట్ కలెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+