లోకేష్ ను తిట్టబోయి..చంద్రబాబును మెచ్చుకున్న మంత్రిగారు! పబ్లిసిటీ లేక పిచ్చిపట్టినట్టుందా?
విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తనకు తెలియకుండానే మెచ్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మంత్రి. చంద్రబాబును పొగిడేశారు. చంద్రబాబు వంటి మేధావి వర్గానికి చెందిన రాజకీయ నాయకుడికి నారా లోకేష్ వంటి కుమారుడు జన్మించడం పండిత పుత్రుడు..పరమ శుంఠుడు అనే సామెతను గుర్తుకు తెస్తోందని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి నారా లోకేష్ వ్యవహారం అంతా పండిత్ర పుత్ర: పరమశుంఠ అనే వ్యవహారాన్ని తలపిస్తోందని రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ నాని ఆరోపించారు. బందర్ పోర్టు తెలంగాణకు ధారాదాత్తం చేస్తున్నారంటూ లోకేష్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, విమర్శించడానికి ఇంకేమీ దొరకనందుకే..ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
రహస్య జీవోలంటూ వాటిని డౌన్‌లోడ్ కూడా చేయడం లోకేష్ కు చేతకావట్లేదని అన్నారు. చంద్రబాబు నాయుడికి, ఆయన కుమారుడికి పబ్లిసిటీ అంటే ఎంత పిచ్చో అందరికీ తెలుసుని, అధికారాన్ని కోల్పోయిన తరువాత సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్ల వారిద్దరికీ పిచ్చిపట్టినట్టు ఉందని అన్నారు. అందుకే ఆ చీప్ పబ్లిసిటీ కోసం చంద్రబాబు, లోకేష్ బాబు బందరు పోర్టుపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల పాటు రాష్ట్రానికి ఉన్న హక్కుల్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు తాకట్టు పెట్టేసి, కేసుల భయంతో తండ్రీకొడుకులు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన విషయం నిజం కాదా?.. అని పేర్ని నాని ప్రశ్నించారు.

పోలవరాన్ని నిర్మించడం చేతకాక..కమీషన్ల పేరుతో భారీగా దండుకున్నారని ఆరోపించారు. బందరు పోర్టు పనులను నవయుగ కంపెనీ చేయకపోతే తామే చేపడతామని స్పష్టం చేశారు. జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయంగా బతికున్నానని చెప్పుకోవడానికే బందరు పోర్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఉమామహేశ్వరరావుకు కొల్లు రవీంద్ర ఒకరు తోడయ్యారని ధ్వజమెత్తారు. బందరు పోర్ట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు వైఎస్సార్ హయాంలోనే వచ్చాయని గుర్తుచేశారు. నారా లోకేష్ ఎవరో రాసిచ్చినవి ట్విట్టర్లో పెట్టడం సరికాదని మంత్రి పేర్ని నాని సూచించారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications