మంత్రి రోజా కూతురికి అరుదైన పురస్కారం: ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్: దక్షిణాదిలోనే ది బెస్ట్‌గా

అమరావతి: పర్యాటక శాఖ మంత్రి రోజా కూతురు అన్షు మలిక సెల్వమణి.. ఓ అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ రచయిత కేటగిరీలో ఆమె రాసిన బుక్ ఎంపికైంది. ఈ బుక్ పేరు ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ (The Flame in My Heart). ఈ కేటగిరీలోకి దక్షిణాది రాష్ట్రాల నుంచి అందిన పుస్తకాల్లో ఇదొక్కటే ది బెస్ట్ అనిపించుకుంది. బెస్ట్ ఆథర్ అవార్డ్ కోసం అన్షు ఎంపికయ్యారు. కోల్‌కతలో నిర్వహించిన కార్యక్రమంలో అన్షు ఈ అవార్డును అందుకున్నారు.

జీ టౌన్ మేగజైన్ నిర్వహించిన కాంపిటీషన్ ఇది. ప్రతి సంవత్సరం వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి పురస్కారాలను అందజేస్తుంటుంది. వారికి పురస్కారాలను అందజేస్తుంటుంది. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వివిధ కేటగరీల కింద వందలాదిమంది రచయితలు రాసిన పుస్తకాలను జ్యూరీ సభ్యులు పరిశీలించారు. అందులో- బెస్ట్ ఆథర్ కేటగిరీ కోసం అన్షు మలిక రాసిన ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ బుక్‌ను ఎంపిక చేశారు.

Minister Roja’s daughter Anshu Malikas book selected under the best author category

మంగళవారం రాత్రి కోల్‌కతలోని క్లారిడేల్ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి సాజన్.. అన్హుకు ఈ అవార్డును అందజేశారు. ఈ విషయాన్ని రోజా తెలిపారు. తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. సాజన్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుంటోన్న ఫొటోను దీనికిక జత చేశారు. అన్షు తల్లిదండ్రులు రోజా-సెల్వమణి ఇద్దరూ సినిమా పరిశ్రమకు చెందిన వారే.

ప్రస్తుతం అన్షు వెబ్ డెవలపర్, కంటెంట్ క్రియేటర్‌ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. రచయితగా రాణిస్తోన్నారు. సామాజిక కార్యకర్తగా గుర్తింపు ఉంది. తన పుట్టిన రోజు వేడుకలను ఎక్కువగా హైదరాబాద్‌లోని ఛీర్స్ ఫౌండేషన్ నిర్వహించే సామాజిక కార్యక్రమాల ద్వారా జరుపుకొంటుంటారు. ఈ ఫౌండేషన్‌కు చెందిన పేద పిల్లల్లో అయిదుమందిని ఆమె చదివిస్తోన్నారు. రోజా కూడా తిరుపతికి చెందిన ఓ విద్యార్థినిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. తన సొంత ఖర్చులతో మెడిసిన్ చదవిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+