తాతైనా చిరంజీవి మాకు హీరోనే.. చరణ్ చిన్నప్పుడు ఎత్తుకున్నది మర్చిపోలేను: మంత్రి రోజా
ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా ఉపాసన రామ్ చరణ్ లకు పాప పుట్టటంపై స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి మనవరాలు పుట్టడంతో, లిటిల్ మెగా ప్రిన్సెస్ కొణిదెల వారి ఇంటికి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవి తాత అయినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు రోజా. అంతేకాదు రామ్ చరణ్ చిన్న పిల్లవాడిగా ఉన్నపుడు ఆయన ఎత్తుకొని ఆడించిన క్షణాలను మంత్రి రోజా గుర్తుచేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తాత అయి ఉండొచ్చు కానీ ఎప్పటికీ హీరోనే అంటూ మంత్రి రోజా ట్వీట్ చేశారు.

ఎప్పుడు యవ్వనంగా, శక్తివంతంగా ఉండే ఈ కుటుంబానికి సర్వశక్తివంతుడైన ఆ భగవంతుడు మెగా ప్రిన్సెస్ రూపంలో ఆశీర్వాదాన్ని అందించాడని మంత్రి రోజా పేర్కొన్నారు. రామ్ చరణ్ చిన్ననాటి రోజులు గుర్తు చేసుకున్న రోజా రామ్ చరణ్ చిన్నప్పుడు నిన్ను నా చేతులతో ఎత్తుకున్న రోజులు ఇంకా గుర్తున్నాయి అని మంత్రి రోజా పేర్కొన్నారు.

ఇప్పుడు నీకు పాప పుట్టిందని వార్త విని చాలా సంతోషంగా ఉందని రోజా వెల్లడించారు. చిరంజీవి సర్ .. మీరు తాత అయినప్పటికీ మాకు మాత్రం ఎప్పటికీ హీరోనే అంటూ మంత్రి రోజా పేర్కొన్నారు. మీరు తాత అనే ప్రతిష్ఠాత్మక బిరుదుతో ఉన్నప్పటికీ మీరు ఎవర్ గ్రీన్ హీరో అంటూ కితాబిచ్చారు. ఉపాసనకు నా శుభాకాంక్షలు అంటూ పేర్కొన్న మంత్రి రోజా మీ ఇంట్లో అడుగు పెట్టిన చిట్టి మహాలక్ష్మి క్షేమం, కుటుంబ శ్రేయస్సు కోసం నేను ప్రార్ధిస్తాను అంటూ రోజా తన ట్వీట్ లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications