విశ్వరూప్ రాజీనామా: జగన్ పార్టీలోకి, మరింత మంది?

విశ్వరూప్ కాంగ్రెసు పార్టీకి కూడా రాజీనామా చేసి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎపి ఎన్జీవోలు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా తాను రాజీనామా చేస్తున్నట్లు విశ్వరూప్ చెప్పారు.
తన రాజీనామాను ఆమోదింపజేసుకోవడానికి రాజభవన్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామాను ఆమోదింపజేసుకుని సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు. గత 60 రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నా పట్టించుకోకపోవడం విచారకరమని ఆయన అన్నారు. శాసనసభ్యుడిగా మాత్రం కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నారు. శాసనసభలో తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా తాను ఓటు చేస్తానని ఆయన చెప్పారు.
విశ్వరూప్ బాటలోనే మరింత మంది సీమాంధ్ర మంత్రులు నడిచే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. వైయస్ జగన్ బెయిల్ మీద విడుదలైన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేవారి సంఖ్య పెరగవచ్చునని అంటున్నారు. విశ్వరూప్ రాజీనామాను ఆమోదింపజేసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గానికి చెందిన తొలి వికెట్ పడిపోయినట్లే లెక్క.












Click it and Unblock the Notifications