చిరంజీవికి మంత్రి రోజా సవాల్ - తమ్ముడికి మద్దతిస్తే జరిగేదిదే..!!

ఏపీ రాజకీయాలు ఇప్పుడు చిరంజీవి కామెంట్స్ చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన కామెంట్స్ కు మంత్రులు సీరియస్ గా స్పందిస్తున్నారు. మంత్రి రోజా చిరంజీవికి సవాల్ చేసారు. చిరంజీవి చెబితే వినే స్థితిలో జగన్ లేరన్నారు. తమ్ముడు పవన్ కోసం చిరంజీవి మాట్లాడి ఉంటారని..మెగ్రా బ్రదర్స్ కలిసి వస్తేనే ప్రజలు తిరస్కరించారని గుర్తు చేసారు. కేంద్ర మంత్రిగా చిరంజీవి ఏపీకి ఏం చేసారని రోజా నిలదీసారు.

చిరంజీవి వ్యాఖ్యల కలకలం: వాల్తేరు వీరయ్య 200 రోజుల ఈవెంట్ లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలంగా మారాయి. ఈ వ్యాఖ్యల పైన ఏపీ మంత్రులు వరుసగా రియాక్ట్ అవుతున్నారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపీ ఉండవల్లి సమర్ధించారు. నాడు రాజ్యసభలో చిరంజీవి మాట్లాడిన కారణంగానే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా నిలిచిందన్నారు. సినిమా పరిశ్రమ పిచ్చుకే అయినా..చిరంజీవి కాదన్నారు. మంత్రులకు చిరంజీవి హోదా పైన సూచన చేయటం తప్పుకాదని ఉండవల్లి పేర్కొన్నారు. మాజీ మంత్రి కొడాలినాని చేసిన కామెంట్స్ కు నిరసనగా మెగా ఫ్యాన్స్ గుడివాడలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

Miniter Roja

మెగాస్టార్ కు రోజా సవాల్: చిరంజీవి కామెంట్స్ పైన మంత్రి రోజా స్పందించారు. సినిమా ఫంక్షన్ లో ఈ రకంగా ఎందుకు మాట్లాడారో తెలియదన్నారు. మెగా బ్రదర్స్ పార్టీ పెట్టి ప్రజల్లోకి వస్తే తిరస్కారం ఎదురైందని గుర్తు చేసారు. పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పని చేసిన చిరంజీవి రాష్ట్రానికి ఏం చేసారని ప్రశ్నించారు. ఏపీకి ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకొచ్చారా అని నిలదీసారు. ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడ లేదో చిరంజీవి చెప్పాలన్నారు. జగన్ మీద నమ్మకం లేకపోతే హీరోలు అందరినీ తీసుకొని చిరంజీవి సీఎం దగ్గరకు ఎందుకు వెళ్లినట్లని అడిగారు ఏ హీరో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శింటచం లేదన్నారు. ఏపీలో జగన్ పాలన ఎలా ఉందో ప్రతీ గడపకు వెళ్తే తెలుస్తుందని..చర్చకు తాను సిద్దమని చిరంజీవికి సవాల్ చేసారు.

నమ్ముకున్న వాళ్లు రోడ్డుపైన
సీఎంగా జగన్ నాలుగేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్ ఉందన్నారు. అయినా ప్రతీ ఇంటికి మంచి చేసారని చెప్పుకొచ్చారు. చిరంజీవికి తమ్ముడు మీద ప్రేమ ఎక్కువై అలా మాట్లాడి ఉంటారని రోజా పేర్కొన్నారు. తమ్ముడికి బలం ఇచ్చేందుకు ఆ కామెంట్స్ చేసి ఉంటారన్నారు. గతంలో పార్టీ పెట్టి నమ్ముకున్న వాళ్లను రోడ్డు పైన వదిలేసి వాళ్లు సినిమాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. వాళ్లు నమ్మకం కోల్పోయారని విశ్లేషించారు. గడప గడపకు వచ్చి చూస్తే జగన్ చేస్తున్న మంచి ఏంటో తెలుస్తుందన్నారు. తిరిగి చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా మరోసారి తిరస్కరణ తప్పదని రోజా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+