• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Jr NTR టీడీపీకి ప్లస్సా- మైనస్సా : నాకేమీ బాధ లేదు..నా అల్లుళ్లిద్దరి పైనా : బాలయ్య సంచలనం...!!

By Lekhaka
|

కొద్ది రోజులుగా సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జూనియర్ రాక కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఏకంగా ప్రత్యేక జెండా ఎగిరింది. చంద్రబాబు పర్యటనలోనూ జూనియర్ కు అనుకూలంగా నినాదాలు చేసారు. కానీ, చంద్రబాబు మాత్రం స్పందించలేదు.

ఇక, 2009 ఎన్నికల ప్రచారంలో టీడీపీ తరపున జూనియర్ ప్రచారం చేసిన సమయంలో ఆయన వాగ్దాటి..వచ్చిన స్పందన మర్చిపోలేకపోతున్న టీడీపీ సీనియర్లు..నందమూరి అభిమానులు తిరిగి జూనియర్ రాకను కోరుకుంటున్నారు. టీడీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు ఆకట్టుకొనే ఛరిష్మా ఉన్న జూనియర్ రాక అవసరమని వాదిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో జూనియర్ టీడీపీలోకి రీ ఎంట్రీ పైన నందమూరి బాల‌కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసారు.

 ప్లస్ అయి మైనస్ అయితే..

ప్లస్ అయి మైనస్ అయితే..

తన అల్లుళ్ల గురించీ స్పందించారు. బాల‌కృష్ణ జన్మదినం సందర్భంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ రాక గురించి ప్రశ్నించగా... జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తిరిగి వస్తారా..రారా అనే అంశం పైన తనకు బాధ లేదని వ్యాఖ్యానించారు. జూనియర ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలి..పార్టీ బాధ్యతలు తీసుకోవాలంటూ చాలా మంది అంటున్నారని..ఇటువంటి విషయాల్లో ఎవరి ఇష్టాలు వాళ్లకు ఉంటాయని చెప్పుకొచ్చారు. వారి అభిప్రాయాన్ని బట్టి మాట్లాడుతారన్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తారా..రారా అనే దాని పైన తాను బాధ పడటం లేదని తేల్చి చెప్పారు. దీనికి కొనసాగింపుగా.. జూనియర్ పార్టీలోకి వచ్చి బాధ్యతలు స్వీకరిస్తే పార్టీకి ప్లస్ అవుతుందా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి ముందు బాలయ్య సంకోచించారు. కొద్దిగా ఆలోచించిన తరువాత చిరు నవ్వుతో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. జూనియర్ రావటం వలన పార్టీకి ప్లస్ అయ్యి ఆ తరువాత మైనస్ అయితే..ఏంటి పరిస్థితి అంటూ ఎదురు ప్రశ్నించారు.

 నాన్న గారి లాగా అందరూ కాలేరు..

నాన్న గారి లాగా అందరూ కాలేరు..

దీనికి తన దైన శైలిలో గణిత శాస్త్ర థీయరీ చెప్పుకొచ్చారు. ప్లస్.. మైనస్ ఆల్ వేస్ మైనస్. ప్లస్ అండ్ ప్లస్..ప్లస్..మైనస్ అండ్ మైనస్ ఈజ్ ప్లస్ అంటూ లెక్కలు చొప్పుకొచ్చారు. ఇవే కాకుండా.. మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. సినిమాల్లో ఉన్న నాన్నగారు సీఎం అయ్యారు అని అందరూ అవ్వాలంటే కావని పరోక్షంగా జూనియర్ గురించి తన అభిప్రాయం ఏంటనేది బాలయ్య స్పష్టం చేసారు. టీడీపీ కార్యకర్తలు చాలా నిబద్దతతో ఉంటారని.. పార్టీలో యువతను ప్రోత్సహించాలని గతంలో తాను కూడా చెప్పానన్నారు. ఇప్పటికీ యువత బాధ్యత తనకు ఇస్తే తాను సిద్దమని..తనకు ఇంకా 16 ఏళ్లే కదా అంటూ చెప్పుకొచ్చారు.

 నా అల్లుళ్లిద్దరూ సమర్ధులే..కానీ,..

నా అల్లుళ్లిద్దరూ సమర్ధులే..కానీ,..

ఇక, తన అల్లుళ్ల ఇద్దరి రాజకీయ సమర్ధత గురించి బాలయ్య చెప్పుకొచ్చారు. వాళ్లిద్దరూ సమర్ధులేనంటూ..ఇద్దరూ జనంతో కలిసి పోయే రకమని చెప్పారు. లీడర్ షిప్ క్వాలిటీస్ పెంచుకోవాలని సూచించారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో... నందమూరి అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలయ్య చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా పరిశీలిస్తే... ఆయన అభిప్రాయం ఏంటనేది..అదే విధంగా పార్టీకి ప్రయోజనం పైనా బాలయ్య అంచనాలు స్పష్టమవుతున్నాయి. అయితే, దీని పైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్..జూనియర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్న అభిమానులు ఏ రకంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Nandmauri Balakrishna sensational comments on junior NTR entry into TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X