వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటీఎస్ రగడ: చంద్రబాబుకు వయసు పెరిగినా బుద్ధి పెరగలేదని ఎమ్మెల్యే రోజా తిట్లదండకం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటిఎస్ పై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నిత్యకృత్యంగా మారింది.వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఏపీ ప్రభుత్వం గతంలో గృహనిర్మాణ సంస్థ నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నామని చెప్తూ వసూళ్ళకు పాల్పడుతోంది అని, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్ టైం సెటిల్మెంట్ పేరుతో జగన్ సర్కార్ వసూళ్లకు పాల్పడుతుంది అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

ఓటీఎస్ స్వచ్చంద పథకం.. అని పదేపదే చెప్తున్న జగన్ సర్కార్

ఓటీఎస్ స్వచ్చంద పథకం.. అని పదేపదే చెప్తున్న జగన్ సర్కార్


ఏకంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ ఉచితంగా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని, ఇప్పుడు ఎవ్వరూ ఆ డబ్బులు చెల్లించవద్దని తేల్చి చెబుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తూ, వన్ టైం సెటిల్మెంట్ పై దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే అనేక మార్లు వైసీపీ మంత్రులతో పాటు ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఓటిఎస్ స్వచ్ఛంద పథకమని, ఎవరి వద్దనుండి బలవంతపు వసూళ్లకు పాల్పడడం లేదని తేల్చి చెబుతున్నారు.

 క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై టీడీపీ ఆగ్రహం

క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై టీడీపీ ఆగ్రహం

వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వన్ టైం సెటిల్మెంట్ స్వచ్ఛందమని పదేపదే వెల్లడిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని టిడిపి నేతలు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారని అంటున్నారు. చెప్పేదానికి, చేసే పనులకు సంబంధం లేదని అంటున్నారు. జగన్ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నిరుపేద ప్రజలకు గృహ హక్కులు ఉచితంగా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

 ఓటీఎస్ పై రోజా క్లారిటీ ... చంద్రబాబును టార్గెట్ చేసిన రోజా

ఓటీఎస్ పై రోజా క్లారిటీ ... చంద్రబాబును టార్గెట్ చేసిన రోజా


ఇక తాజాగా వైసీపీ నగిరి ఎమ్మెల్యే రోజా ఓటిఎస్ పథకంపై మరోమారు స్పష్టత ఇవ్వడంతో పాటుగా, చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా ప్రతిపక్షనేతగా హుందాగా వ్యవహరిస్తే కనీస గౌరవం అయినా దక్కుతుందని ఆమె సూచించారు. జగన్ పాలన చూసి ఓర్చుకోలేక ప్రతిపక్షాలకు పిచ్చెక్కి విమర్శలు చేస్తున్నాయి అంటూ మండిపడ్డారు రోజా.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు 14 మందికి కూడా ఇళ్ల హక్కు ఇవ్వలేదు

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు 14 మందికి కూడా ఇళ్ల హక్కు ఇవ్వలేదు


అంతేకాదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర్రెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తే, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ నాలుగడుగులు ముందుకు వేస్తున్నారని రోజా కితాబిచ్చారు. జగన్ పాలన చూసి ఓర్చుకోలేక పోతున్నారని తెలుగు తమ్ముళ్ళపై రోజా ధ్వజమెత్తారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు 14 మందికి కూడా ఇళ్లపై హక్కు కల్పించలేకపోయారు అని రోజా ఎద్దేవా చేశారు. రిజిస్ట్రేషన్ తో పాటు సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని అమలు చేయడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి అంటూ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.

పేదవాడికి ఉపయోగపడే ఒక్క పథకం చంద్రబాబు ఇవ్వలేదు

పేదవాడికి ఉపయోగపడే ఒక్క పథకం చంద్రబాబు ఇవ్వలేదు

ఎవరి వద్ద నుండి బలవంతపు వసూళ్లు చెయ్యటం లేదన్నారు. ప్రజలే స్వచ్చందంగా చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. డబ్బులు కట్టొద్దు అని అంటున్నారే తప్ప వన్ టైం సెటిల్మెంట్ ను ఎవరూ వ్యతిరేకించడం లేదని ఎమ్మెల్యే రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రతీదీ రాద్దాంతం చెయ్యటం అలవాటుగా మారిందని రోజా అసహనం వ్యక్తం చేశారు. పేదవాడికి ఉపయోగపడే ఒక్క పథకం కూడా చంద్రబాబు తీసుకురాలేదన్నారు రోజా. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సరే చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు జగన్ టార్గెట్ గా మారారని రోజా అసహనం వ్యక్తం చేశారు.

English summary
MLA Roja says OTS benefits poor people, and made harsh remarks on Chandrababu. Roja slams Chandrababu worked for 14 years, did not give 14 houses to the poor as CM. Chandrababu did not grow in intellect despite his age.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X