వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను - జై అమరావతి : ఉండవల్లి శ్రీదేవి..!!

వైసీపీ సస్పెన్షన్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీకి వెళ్లాలంటే తనకు భయం వేస్తోందని వ్యాఖ్యానించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన సమయం నుంచి వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. జగనన్న హౌసింగ్ స్కీంలో వేల కోట్ల స్కాం జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.తాను క్రాస్ ఓటింగ్ చేసానని ఎలా అరోపణలు చేస్తారని ప్రశ్నించారు. తాను రాజధాని అమరావతి రైతులకు అండగా నిలుస్తానని..హై అమరావతి అని ఉండవల్లి శ్రీదేవి నినదించారు.

తాడికొండ ఎమ్మెల్సీ శ్రీదేవి వైసీపీ నాయకత్వం పైన ఆరోపపణలు చేసారు. అమరావతి పరిధిలోని గ్రామాల్లో తరలిపోతున్న ఇసుక ..అక్కడ సాగుతున్న దందాలకు తాను అడ్డుగా మారానని చెప్పుకొచ్చారు. దీంతో తనను టార్గెట్ చేసారన్నారు. కరోనా సమయంలో తాను ప్రాణాల కంటే పార్టీ గెలుపు కోసం పని చేసానని చెప్పారు. తనకు కేటాయించిన ఓటు మేరకు తాను ఓటింగ్ చేసానని.. తాను క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. తాను ఓటు వేసే సమయంలో ఎవరైనా టేబుల్ కింద కూర్చున్నారా అని అని నిలదీసారు. తన ప్యానెల్ లోనే జనసేన ఎమ్మెల్యేతో పాటుగా అసంత్రుప్తితో ఉన్న కాకినాడ ఎమ్మెల్యే కూడా ఉన్నారని శ్రీదేవి చెప్పుకొచ్చారు.

MLA Undavalli Sridevi Seriously reacted on suspension and announces her support for Amaravati Capital

ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో తనను టార్గెట్ చేసారని వ్యాఖ్యానించారు. తనకు ఇప్పటికీ జగన్ పైన నమ్మకం ఉందన్నారు. తన పక్కన ఉన్నవారిని జగన్ నమ్ముతారని చెప్పుకొచ్చారు. తాను ఎన్నికల సమయం లో అమరావతిలోనే రాజధాని ఉంటుందని అక్కడి ఓటర్లకు హామీ ఇచ్చానని చెప్పారు. అమరావతి కోసం అక్కడి మహిళలు పోరాటం చేస్తుంటే వారికి మద్దతు ఇవ్వలేకపోయాననే బాధ తనలో ఉందన్నారు. ఇక నుంచి వారితోనే తాను ఉంటానని స్పష్టం చేసారు. తాను ఇప్పుడు స్వతంత్ర ఎమ్మెల్యేనని.. ఇక నుంచి అమరావతి అనుకూల ఉద్యమాల టెంట్ లోనే ఉంటానని వెల్లడించారు. జై అమరావతి అంటూ ఎమ్మెల్యే శ్రీదేవి నినదించారు. అమరావతిలో జరిగిన డెవలప్ మెంట్ లో 10 శాతమైన రాష్ట్రం మొత్తంలో జరిగిందా అని ప్రశ్నించారు.

తన రాజకీయ భవిష్యత్ పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. తాను నాలుగేళ్ల పాటు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేసారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా స్థానికులకు అండగా ఉంటానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+