మాధురి కోసం దువ్వాడ.. అధికారికి బెదిరింపులు, షాకింగ్ ఆడియో!!

వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారిన విషయం తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథ చిత్రం చూసే వాళ్లకు, వినే వాళ్లకు మన రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్లా అన్న చర్చకు, విస్మయానికి కారణంగా మారింది.

దువ్వాడ ఫ్యామిలీ పంచాయితీ
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకుని తమను పట్టించుకోవడంలేదని, వేరే మహిళను ఇంటికి తెచ్చి పెట్టుకుని రాసలీలలు చేస్తున్నాడని దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి ఆమె కూతుళ్ళతో కలిసి టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటిముందు గత ఐదురోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దువ్వాడ వాణి, దివ్వెల మాధురి అనే మహిళపై సంచలన ఆరోపణలు చేయడంతో మాధురి స్పందించి చేసిన వ్యాఖ్యలతో రచ్చ మరింత ముదిరింది.

MLC Duvvada srinivas Threaten to petrol refinary officer for restoration of Madhuri Petrol Bunk shocking audio

కేసులు.. కారు ప్రమాద ఘటన
చిలికి చిలికి గాలి వానగా మారిన వ్యవహారంలో భార్య దువ్వాడ వాణి పైన దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే దువ్వాడ వాణి ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్ పైన కూడా పోలీసులు కేసు నమోదుచేశారు. ఇదిలా జరుగుతూ ఉండగానే దువ్వాడ వాణి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర మనస్థాపానికి గురైన మాధురి టెక్కలి నుంచి పలాసకు ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

ఆత్మహత్య చేసుకోవాలనే ప్రమాదం చేశానన్న మాధురి.. కేసు
అయితే ఆ కారు ప్రమాదం తానే కావాలని చేశానని, తాను ఆత్మహత్య చేసుకోవాలని అలా కారు ప్రమాదం చేశానని దువ్వాడ వాణి మాటలతో మనస్థాపం చెంది తాను చనిపోవాలనుకుంటున్నానని దివ్వెల మాధురి తెలిపారు. దువ్వాడ వాణీ చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తనను తన పిల్లలను ట్రోల్ చేస్తున్నారని దివ్వెల మాధురి పేర్కొన్నారు. దీంతో మాధురిపైన కూడా కేసు నమోదైంది.

దువ్వాడతోనే ఉంటానన్న మాధురి.. తాజాగా ఆడియో వైరల్
అంతకుముందు తాను దువ్వాడ శ్రీనివాస్ కలిసే ఉంటున్నామని, కలిసే గుళ్ళు తిరుగుతున్నామని, దువ్వాడ శ్రీనివాస్ తనకు ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, కేర్ టేకర్ అంటూ మాధురి వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ఎపిసోడ్ కొనసాగుతూ ఉండగానే తాజాగా దివ్వెల మాధురి కోసం దువ్వాడ శ్రీనివాస్ ఒక అధికారిని బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తుంది.

మాధురి కోసం అధికారికి బెదిరింపులు
పెట్రోల్ రిఫైనరీ సంస్థ అధికారిని దివ్వెల మాధురి పెట్రోల్ బంక్ పునరుద్ధరణ కోసం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బెదిరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దువ్వాడ కుటుంబ కధా చిత్రంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన మాధురికి శ్రీకాకుళం జిల్లా తలగాం గ్రామ కూడలిలో పెట్రోల్ బంక్ అనుమతులను తక్షణమే పునరుద్ధరించాలంటూ సంబంధిత అధికారికి ఫోన్ చేసిన దువ్వాడ ఆ రిఫైనరీ అధికారిని తీవ్రస్వరంతో బెదిరించారు.

రిఫైనరీ అధికారిపై కోపంతో ఊగిపోయిన దువ్వాడ
బంకు ఎప్పుడో అనుమతులు రద్దయాయని, డీలర్ షిప్ కూడా తొలగించామని, కాబట్టి పునరుద్ధరణ సాధ్యం కాదని అధికారి బదులిచ్చినప్పటికీ తనదైన శైలిలో అధికారి పైన విరుచుకుపడ్డాడు. అసలు ఈ విషయంలో సంబంధిత వ్యక్తి మాట్లాడాలని మీరు ఎలా మాట్లాడుతున్నారని అధికారి ప్రశ్నించగా కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అతనితో వాగ్వాదానికి దిగాడు.

మాధురి కోసం చాలానే చేసిన దువ్వాడ
తాను ఎమ్మెల్సీనని, రోడ్డు సైడ్ వ్యక్తిని కాదంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు దువ్వాడ గొంతు పెంచి మాట్లాడడంతో అరవద్దంటూ ఆ అధికారి దువ్వాడకు సూచించారు. అయితే ఈ ఆడియోతో మాధురి కోసం దువ్వాడ చాలానే చేసాడు అని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+