ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డికి దొరకని బెయిల్, అనుచరుల్లో ఆందోళన
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డికి బెయిల లభించలేదు. భారత పారీశ్రామిక ఆర్థిక సంస్థ నుంచి కోట్లాది రూపాయలు రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఫిర్యాదుపై జనవరి 21వ తేదీ సీబీఐ వాకాటి నారాయణరెడ్డిని అదుపులోకి తీసుకుంది.
ఆయన జైలుకు వెళ్లి మూడు వారాలు దాటింది. అయినకు ఇప్పటికీ బెయిలు రాలేదు. తీసుకున్న రుణం ఎక్కడెక్కడికి వెళ్లిందన్న కోణంలో ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. తీసుకున్న రుణం ఎక్కడ వినియోగించారు. తీసుకున్న ఏడాదిన్నరకే కంపెనీ మూత వేయడం వంటి ఆనేక కోణాల్లో ఆరా తీస్తున్నారు.

వాకాటి జైలుకు వెళ్లడంతో ఆయన అనుచరుల్లో ఆందోళన కనిపిస్తోంది. సూళ్లూరుపేట ప్రాంతానికి చెందిన కొందరు ఆయన కంపెనీల్లో కీలకంగా వ్యవహరించారు. వారిపైనా సీబీఐ కన్నేసినట్లుగా తెలుస్తోంది. వారి ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయో గుర్తించే పనిలో ఉన్నారు.
ఇదే ప్రాంతానికి చెందిన కొందరు ఆయన ఏర్పాటు చేసిన కంపెనీల్లో డైరెక్టర్‌లుగా ఉన్నారు. ప్రస్తుతం వారు ఆయనను పరామర్శించేందుకు జైలు వద్దకు వెళ్లలేకపోతున్నారని తెలుస్తోంది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications