పవన్‌కు ఆర్బికే అంటే తెలుసా; చంద్రబాబువి ఔట్ డేటెడ్ పాలిటిక్స్: ఎంపీ మార్గాని భరత్

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వై ఎస్ ఆర్ సి పి ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ పాలిటిక్స్ చేస్తాడని ఆయన విమర్శలు గుప్పించారు. ఇక ఆర్బి కే అంటే తెలియని పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ కు అసలు దేశభక్తి ఉందా అని ప్రశ్నించిన ఎంపీ మార్గాన్ని భరత్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఫోటో పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటోలో భగత్ సింగ్ పేరును పవన్ బూట్ల కింద పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఇక వ్యవసాయం పై ఎన్నో మాటలు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మార్గాని భరత్ అసహనం వ్యక్తం చేశారు.

MP Margani bharat slams Pawan kalyan and Chandrababu outdated politics

వ్యవసాయం పై పవన్ కు ఎంత అవగాహన ఉందో తాజాగా ఆయన మాటలతో బయటపడిందని పేర్కొన్నారు. పవన్ కు ఆర్ బి కే అంటే తెలుసా అంటూ ప్రశ్నించారు. ఎంత ధాన్యం కొనుగోలు చేశారో కనీస అవగాహన అయినా ఉందా అని నిలదీశారు. ధాన్యం కొనుగోళ్లపై మీ దగ్గర ఏమైనా గణాంకాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి రైతుల వద్ద ధాన్యాన్ని సేకరిస్తుందని పేర్కొన్నారు.

పవన్ ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నాడని పవన్ ది పూర్తిగా అవగాహన రాహిత్యమని మార్గాని భరత్ తేల్చిచెప్పారు. కోనసీమ లో రైతుల కోసం రాత్రి పర్యటిస్తే ఉపయోగం ఉంటుందా ఆని పవన్ ను ప్రశ్నించిన ఆయన, ఏది మాట్లాడినా హేతుబద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడకూడదని, అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఇక ఇదే సమయంలో చంద్రబాబు ని టార్గెట్ చేసిన మార్గాని భరత్ చంద్రబాబు అవుట్ డేటెడ్ రాజకీయాలు చేస్తున్నాడని చంద్రబాబు ఇంకా పాత చిప్ వాడుతున్నారని విమర్శించారు. బాబు హయాంలో మూడు వందల కరువు మండలాలు ప్రకటిస్తే ఒక మండలంలో కూడా ఆయన పర్యటించలేదని రైతులను ఆదుకునే ప్రయత్నం చంద్రబాబు ఏనాడూ చేయలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మార్గాని భరత్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+