ఈసారి తల్లి వంతు.. నారాయణ!నారాయణ!: ఎంపీ సాయిరెడ్డి వదిలేలా లేరుగా!!
టిడిపి నాయకుడు, మాజీ మంత్రి నారాయణ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల నారాయణ మరదలు కృష్ణప్రియ మంత్రి నారాయణ తనపై చేసిన అరాచకాలను, అకృత్యాలను సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.ఇక తాజాగా మాజీ మంత్రి నారాయణ తీరుపై ఆమె తల్లి చెప్పిన అనేక విషయాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంటిగుట్టు ఎప్పుడు బయటపడ్డా ఒక మెంటల్ సర్టిఫికెట్ తో రెడీగా ఉంటుంది టీడీపీ. అసలు మీ పార్టీకే మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉంది. మరదలు సంగతి సరే కన్నతల్లే చెప్పారుగా. ఆమెపైనా ముద్ర వేస్తారా నారాయణ!నారాయణ! నారాయణ! pic.twitter.com/HKETgF54gA
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 1, 2023
మాజీమంత్రి నారాయణ తనకు చెప్పకుండా, తనతో తెల్ల కాగితం మీద సంతకాలు తీసుకుని తన ఆస్తిని కాజేశాడు అని, తనను చూడడానికి కూడా రాడని, ఆయనను చూడక ఎంతోకాలం అయిందని తల్లి ఆవేదనతో చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే మాజీమంత్రి నారాయణ అరాచకాలపై మండిపడుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అటు తెలుగుదేశం పార్టీపైన, మాజీమంత్రి నారాయణ పైన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

విజయసాయి మాజీ మంత్రి నారాయణ తల్లి చెప్పిన మాటల వీడియోను పోస్ట్ చేశారు. ఇంటిగుట్టు ఎప్పుడు బయటపడ్డా ఒక మెంటల్ సర్టిఫికెట్ తో రెడీగా ఉంటుంది టీడీపీ అంటూ విరుచుకుపడిన విజయసాయిరెడ్డి అసలు మీ పార్టీకే మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు. మరదలు సంగతి సరే కన్నతల్లే చెప్పారుగా నారాయణ బాగోతం అంటూ పేర్కొన్నారు.
ఆమెపైనా ముద్ర వేస్తారా నారాయణ!నారాయణ! నారాయణ! అంటూ మరో మరి సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. అంతకుముందు టిడిపికి టిడిపి నేతలకు కొమ్ముకాస్తున్న పత్రికలు, చానళ్ల పైన విరుచుకుపడ్డారు. లైంగిక వేధింపులకు గురైన నటీమణులు, విద్యావంతులైన మహిళలు 'Mee Too' పేరుతో ఉద్యమం చేస్తే సెన్షేషనల్ కథనాలు ప్రచురించి, ప్రసారం చేసిన ఒక వర్గం మీడియా ఇప్పుడు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నారాయణ సోదరుడి భార్య తనపై జరుగుతున్న వేధింపుల గురించి బాహాటంగా చెబుతుంటే కళ్లు, చెవులు, నోరు మూసుకుందని విమర్శించారు. బలహీనుల పక్షాన నిలబడాల్సిన మీడియా టీడీపీ నేతకు కొమ్ము కాస్తోందని ప్రజలకు వెయ్యోసారి అర్థమైంది అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications