Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముంబై నటి జెత్వానీ కేసు.. అంబటి రాంబాబు షాకింగ్ వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు, రాజకీయ నేతల వేధింపులకు గురైన ముంబై నటి కాదంబరీ జెత్వానీ వ్యవహారం దుమారం రేపుతోంది. ఇవాళ విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసిన జెత్వానీ సీపీతో తనపై జరిగిన వేధింపులకు సంబంధించి ఆధారాలతో సహా పలు సంచలన విషయాలను వెల్లడించారు.

జెత్వానీ వేధింపుల ఆరోపణలపై వైసీపీ నేతలు ఆగ్రహం
ఇదిలా ఉంటే జెత్వానీ వేధింపుల ఆరోపణలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. చంద్రబాబు కక్ష సాధింపు చర్యల్లో ఇది కూడా ఒక భాగమని ఆరోపిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్‌ కు సన్నిహితుడన్న ఒకే ఒక కారణంతో సజ్జల రామకృష్ణారెడ్డిపై ఇష్టానుసారం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Mumbai actress kadambari Jethwani case Ambati Rambabu shocking comments

ప్రభుత్వానికి బూమరాంగ్‌ అవుతుంది: అంబటి రాంబాబు
జత్వానీ కేసులో ప్రభుత్వం కుక్కతోక పట్టుకుని గోదారి ఈదాలనుకుంటోందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆ కేసులో ఏదో చేయాలనుకుని గాలి మేడలు కడుతున్నారన్న అంబటి, అది కచ్చితంగా ప్రభుత్వానికి బూమరాంగ్‌ అవుతుందని స్పష్టం చేశారు. ఈ కేసులో అసలు నిజాలు నిదానంగా బయటకు వస్తాయని, అయినా ఏదో చేయాలన్న దుర్మార్గమైన ఆలోచనతోనే ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని ఆక్షేపించారు.

కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఇదంతా
చంద్రబాబు పాలనలో అధికారులపైనా వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. తమను అరెస్టు చేసిన అధికారులందరిపైనా చర్యలు తీసుకోవాలన్న ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తోందని, అందుకే వారి మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం చేస్తున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. అందుకోసం అధికారులకు పార్టీల ముద్ర వేయడం దారుణమన్న ఆయన, ఇలాంటి ఉడత ఊపులకు తమ పార్టీ భయపడదని తేల్చి చెప్పారు.

మార్గదర్శి చిట్స్‌ కేసుల్లో సీఐడీ అప్పీళ్ల ఉపసంహరణ క్విడ్‌ప్రొకో
అంతేకాదు మార్గదర్శి చిట్స్‌ కేసుల్లో సీఐడీ అప్పీళ్ల ఉపసంహరణ కచ్చితంగా క్విడ్‌ప్రొకో అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌ అయ్యారు. రామోజీ కుటుంబాన్ని కాపాడడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయన సంస్ధలను నిలబెట్టడమే సీఎం ఉద్దేశం అంటూ మండిపడ్డారు. రామోజీరావు అనేక అక్రమాలకు పాల్పడిన వ్యక్తి ఆయన ఆర్ధిక నేరస్తుడు. వైట్‌ కాలర్‌ క్రిమినల్‌ అంటూ వ్యాఖ్యలు చేశారు.రామోజీ సామ్రాజ్యమంతా అక్రమం. అన్యాయం అన్న మాజీ మంత్రి అంబటి చంద్రబాబు కోసం రామోజీ సంస్ధలు..రామోజీ సంస్ధల కోసం చంద్రబాబు పనిచేస్తారని విమర్శించారు. ఇది కచ్చితంగా క్విడ్‌ప్రొకో కాదా? అని నిలదీశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+