కంచుకోటల్లోనూ మారుతున్న ఫలితాలు - వార్ ఒన్ సైడ్, వారికి ఆ ఒక్కటే రిలీఫ్..!!
స్థానిక ఎన్నికల్లో వార్ ఒన్ సైడ్ గా మారింది. ఫలితాలు ఏకపక్షంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ నుంచి పోలింగ్ వరకు పోరు హోరా హోరీగా కొనసాగింది. ఏకగ్రీవాల పైన రాజకీయ రచ్చ చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు లోనూ కేసులు దాఖలయ్యాయి. అయితే, ఫలితాల వేళ ఊహించని దెబ్బ. కూటమిలో పార్టీలు అన్నింటా ఆధిక్యతలో కొనసాగుతున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో వైసీపీకి ఒక్కటే రిలీఫ్ గా కనిపిస్తోంది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. సాయంత్రానికి ఫలితాల పైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్స్ కూటమికి ఏకపక్షంగా కనిపిస్తున్నాయి. ఎక్కడా వైసీపీకి అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో విజయం ఖాయమనే విధంగా ఫలితాల సరళి కొనసాగుతోంది. 13 కార్పోరేషన్లలో వైసీపీ నాలుగు చోట్ల పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కూటమి అన్ని కార్పోరేషన్లలోనూ ఆధిక్యతలో ఉంది. అదే విధంగా మున్సిపాల్టీల్లో సీమ ప్రాంతంలో వైసీపీ కొన్ని చోట్ల పోటీ ఇవ్వగలిగినా.. అక్కడా కూటమి పార్టీలదే ఆధిక్యత కనిపిస్తోంది. నెల్లూరు, కర్నూలు, అనంతపురం, విజయనగరం మేయర్ స్థానాల పైన తొలి నుంచి వైసీపీ భారీ అంచనాల తో కనిపించింది. ఫలితాల్లో మాత్రం కూటమికే అనుకూలంగా ఉన్నాయి. పులివెందులలో పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీకి ఆధిక్యత లభించింది.

సాయంత్రానికి తుది ఫలితాలు
ఇక.. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్నిటా కూటమి అభ్యర్ధులే లీడ్ లో కొనసాగుతున్నారు. ప్రకాశం జిల్లాలో భారీ తుఫాను కారణంగా ఓట్ల లెక్కింపు ఆలస్యం అయింది. అనంతపురం ఓట్ల లెక్కింపులో సమన్వయ లోపం కనిపిస్తోంది. విజయవాడలో పోస్టల్ బ్యాలెట్ లో ఏబీ వెంకటేశ్వర రావు రెండో స్థానంలో నిలిచారు. కడప జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తోంది. పులివెందుల, జమ్మల మడుగు సహా అన్నింటా టీడీపీ జెండా ఎగురుతోంది. ఇక.. పలు జిల్లాల్లో వార్డుల్లో మాత్రమే వైసీపీకి విజయం దక్కుతున్నట్లు కనిపిస్తోంది. జనసేన, బీజేపీకి కేటాయించిన స్థానాల్లోనూ ఆ పార్టీలు ముందంజలో ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో కూటమికే అనుకూల ఫలితాలు ఉంటాయని ముందు నుంచి అంచనా వేసినట్లుగానే తుది ఫలితం ఉండే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ, జనసేన సైతం తొలి సారి రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ బలం పెంచుకోవటానికి ఈ ఎన్నికలను సద్వినియోగం చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది.













Click it and Unblock the Notifications
