బాబుకు రివర్స్, బీజేపీ గట్టి షాక్: ఒంటరిగా.. మురళీధరరావు సంచలనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు షాకిచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు మింగుడుపడనివే.
విజయవాడ/చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు షాకిచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు మింగుడుపడనివే.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా ములకలచెరువులో బుధవారం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ బూత్ స్థాయి కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మురళీధర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పీలో రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోను తమ పార్టీ సొంతంగా పోటీ చేస్తుందని చెప్పారు.
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో కూడా పార్టీ బలోపేతానికి ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

బీజేపీతో వెళ్లేందుకే బాబు..
రెండు రోజుల క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఎన్డీయే పార్టీల సమావేశంలో పాల్గొన్నారు. నవ్యాంధ్ర ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అలాగే, రాజకీయంగా జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపికి ఇబ్బందికరంగా మారారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసే నడుస్తామని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు అలా.. కానీ
ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత దేశం వైపు ప్రపంచం చూస్తోందని, అందుకు మోడీయే కారణమని తెలిపారు. మోడీ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్తామని చెప్పారు.

తెరపైకి మళ్లీ ఒంటరి పోరు
కానీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మురళీధర రావు మాత్రం తాజాగా, బుధవారం చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు షాకింగ్. అయితే, పార్టీలో ఉత్సాహం నింపే ఉద్దేశ్యంలో మాట్లాడారా లేక నిజంగానే పోటీ చేయడంపై బీజేపీలో అంతర్గతంగా చర్చ సాగుతోందా అనేది తెలియాలి.

అప్పటికే బీజేపీలో పలుమార్లు చర్చ
ఇప్పటికే ఏపీలో సొంతంగా పోటీ చేసే అంశంపై బీజేపీలో పలుమార్లు చర్చ జరిగింది. అయితే ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పడంతో ఆ పార్టీ ఆ తర్వాత ఇరుకున పడింది. దీంతో కొన్నాళ్లు వారు మౌనం వహించారు. ఇప్పుడు ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తున్న నేపథ్యంలో మరోసారి ఒంటరి పోటీ అంశం తెరపైకి రావడం గమనార్హం.
-
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
చిరంజీవి మార్గమా? పవన్ వ్యూహమా? విజయ్ ముందున్న అసలు సవాల్ ఇదే! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం











Click it and Unblock the Notifications