మోత మోగించాల్సిందే... టీడీపీ కొత్త నిరసన ప్లాన్!!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశ విదేశాలలోని అభిమానులు రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించి వైసీపీ సర్కార్ ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడుతున్నారు.

తెలుగుదేశంపార్టీ శ్రేణులు మరో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు గారికి మద్దతుగా సెప్టెంబర్ 30 2023 రాత్రి 7గంటల నుండి 7గంటల 5నిమిషాల వరకు ఐదు నిమిషాల పాటు ఐదు కోట్ల ఆంధ్రులు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడ ఉన్నా బయటకు వచ్చి గంట కొట్టండి లేదా ప్లేట్ మీద గరిటతో కొట్టండి అంటూ పిలుపునిచ్చింది టీడీపీ.

Must ring the bell.. motha mogiddam.. TDP new protest plan for chandrababu!!

రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టాలని, విజిల్ ఉంటే విజిల్ వెయ్యాలని.. ఏదో ఒకరకంగా 7గంటల నుండి 7గంటల 5 నిమిషాల వరకు చంద్రబాబు కోసం మోత మోగించండి అంటూ తెలుగుదేశం పార్టీ పేర్కొంది. మీరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని బాబుతో నేను అంటూ పేర్కొన్న టీడీపీ ప్యాలెస్ లో ఉన్న సైకో జగన్ కి వినిపించేలా మోత మోగించాలని పిలుపునిచ్చింది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన టిడిపి నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే అంటూ పేర్కొంది. చంద్రబాబు గారికి మద్దతుగా మోత మోగించండి. మీరు ఏం చేసినా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయండి అని పేర్కొంది.

చంద్రబాబుకు ప్రజల మద్దతు ఎంతుందో సైకో జగన్ కు అర్థమయ్యేలా చెప్పాలంటూ తెలుగు దేశం పార్టీ పోస్టు పెట్టింది. మరి రేపు చంద్రబాబు కోసం ఎంతమంది మోత మోగిస్తారు. ఎంతమంది చంద్రబాబుకు మద్దతుగా నిలబడతారు అనేది తెలియనుంది.టీడీపీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో రేపు తెలియనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+