టీటీడీ చైర్మన్ పదవిపైనే కాదు తన రాజకీయాలపై నాగబాబు కుండ బద్దలు కొట్టారుగా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు తర్వాత టిడిపి కూటమి ఘనవిజయం సాధించడంతో ఈ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఏపీలో అధికారం టిడిపి కూటమి హస్తగతం కావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది టిడిపి కూటమి. ఇదే సమయంలో మంత్రులుగా ఎవరికి అవకాశం వస్తుంది అన్న దానిపైన నామినేటెడ్ పోస్టుల పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

టిటిడి చైర్మన్ వార్తలపై స్పందించిన నాగబాబు
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా జనసేన నాగబాబుకు అవకాశం కల్పిస్తున్నట్టుగా మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం టిటిడి చైర్మన్ అంటూ వైరల్ అవుతున్న వార్తలపై నాగబాబు స్పందించారు. తాను టిటిడి చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తనకు ఏ పదవి మీద ఆశ లేదని, తాను ఏ పదవిని ఆశించడం లేదని నాగబాబు ప్రకటించారు.

Nagababu responded on TTD chairman post and also on his politics

ఆ వార్తలపై నాగబాబు ట్వీట్
అంతే కాదు తాను ఉన్నంతవరకు జనసేన పార్టీకి అండగా ఉంటానని స్పష్టం చేశారు. టిటిడి బోర్డు చైర్మన్ అవుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వివరణ ఇచ్చిన నాగబాబు ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అలాగే అధికారికంగా వెరిఫై చేయబడిన తన సోషల్ మీడియా ఖాతాల నుండి వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

చిరంజీవి ఇంట పవన్ కళ్యాణ్ విజయోత్సవ గెట్ టుగెదర్
దయచేసి ఎవరు ఈ ఫేక్ వార్తలను ప్రచారం చేయొద్దంటూ నాగబాబు పోస్ట్ పెట్టారు. కాగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లిన సందర్భంలో కూడా నాగబాబు అక్కడ జరిగిన సెలబ్రేషన్స్ లో పాలుపంచుకున్నారు.

పాల్గొన్న నాగబాబు చెప్పిందిదే
పవన్ కళ్యాణ్ విజయం సాధించిన సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి గెట్ టుగెదర్ చేసుకున్నామని, మెగా ఫ్యామిలీ అంతా ఈ వేడుకకు వచ్చిందని నాగబాబు చెప్పారు .ఎలాంటి సమయంలోనైనా తమ కుటుంబం పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటుందని, ప్రజలకు సేవ చేయడం తప్ప, పదవులపై తమకు ఆశ లేదన్నారు. జనసేనని ఇంకా ఉన్నత స్థానాలకు ఎలా తీసుకువెళ్లాలి అన్న ఆలోచన చేస్తున్నామని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+