ఊటీకి వెళ్లి షూటింగ్ చేసినంత ఈజీ కాదు: చిరుపై నాగం

Nagam Janardhan Reddy
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి కేంద్రపాలిత ప్రాంతం అంటే కూడా తెలియదని, యూటి అంటే ఊటీ వెళ్లడం కాదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి ఆదివారం ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ను యూటి చేయాలని చిరంజీవి మాట్లాడుతున్నారని, యూటి అంటే ఊటికి వెళ్లి షూటింగ్ చేసుకున్నంత ఈజీ కాదన్నారు.

చిరంజీవి చేస్తున్న యూటి డిమాండ్ అర్థరహితమని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాడూ బొంగరం లేని వ్యక్తి అని, ఆయన ఎన్ని చేసినా తెలంగాణ ఆగదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు బిజెపి జాతీయస్థాయిలో తీసుకున్న నిర్ణయమని, ఇది ఒక వ్యక్తి, ఒక ప్రాంతం వారు తీసుకున్న నిర్ణయం కాదన్నారు. జాతీయ పార్టీ నిర్ణయంలో మార్పు ఉండదని, తెలంగాణ ఏర్పాటు విషయంలో వెనక్కిపోదని పునరుద్ఘాటించారు.

కాంగ్రెస్ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే బిజెపి మద్దతు ఇస్తుందని, లేకపోతే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం ఖాయమని అన్నారు. ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణను ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రిని వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు.

టి కాంగ్రెస్ భేటీ

తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ముఖ్య నేతలు సోమవారం ఉదయం పది గంటలకు మంత్రి జానా రెడ్డి నివాసంలో అత్యవసరంగా భేటీ కానున్నారు. హైదరాబాద్‌పై వస్తున్న కథనాలు భద్రాచలం తదితర అంశాలపై చర్చించేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు నేతలు తెలిపారు. ఆంటోనీ కమిటీ, హోం శాఖ రహస్య నివేదికలు తెలంగాణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని, హైదరాబాద్‌పై ఎలాంటి మెలికలు పెట్టి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తెలంగాణకు నష్టమేననే అభిప్రాయం నేతల్లో నెలకొంది. దానిపై చర్చించి పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని కేంద్రాన్ని కోరనున్నారు.

పెత్తనం ఒప్పుకోం: హరీశ్

హైదరాబాద్‌పై ఆంధ్రోళ్ల పెత్తనం ఉంటే తెలంగాణ ఏర్పడి ప్రయోజనమేమిటని, ఆంక్షలు లేని తెలంగాణ ఇస్తే సరి లేదంటే కాంగ్రెస్‌పై దండయాత్రే హైదరాబాద్‌ను అప్రకటిత యూటి చేస్తే చూస్తూ ఊరుకోమని తెరాస సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు నిప్పులు చెరిగారు. హైదరాబాద్ ఆదాయాన్ని ఆంధ్రాకు పంచుతామంటే చూస్తూ ఊరుకోవడానికి చేతగాని వాళ్లం కాదన్నారు. హైదరాబాద్‌పై సీమాంధ్ర పెట్టుబడుదారులకు కేంద్రం తలొగ్గితే దండయాత్ర తప్పదని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+