ఒరేయ్... బాలకృష్ణ అంది జూనియర్ ఎన్టీఆర్ ను కాదురా బాబూ!
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా నందమూరి ఫ్యామిలీలో ఉన్న విభేదాలు బయటపడ్డాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి కోపంతో ఊగిపోయారని, వెంటనే వాటిని తొలగించమన్నారని, బాబాయ్-అబ్బాయ్ మధ్య రోజురోజుకు పెరుగుతున్న దూరం మరింత పెరిగిందంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ నడుస్తోంది.
Recommended Video

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, బాలయ్య అభిమానుల మధ్య ఈ విషయమై సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. తారక్ గురించి బాలయ్య అలా ఎలా మాట్లాడాడు? అంటూ ఎన్టీఆర్ అభిమానులు షాకవుతున్నారు. అయితే అసలు విషయం అది కాదని, బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేసింది నిజమే కానీ ఆ కోపానికి వేరే కారణం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా కట్టిన రెండు ఫ్లెక్సీలే ఆయన కోపానికి కారణమని, వాటిని ఒకసారి నిశితంగా పరిశీలించాలని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.

కొందరు అభిమానులు అత్యుత్సాహంతో నందమూరి తారకరామారావు 28వ వర్ధంతికి విచ్చేయనున్న జూనియర్ ఎన్టీఆర్ కి స్వాగతం.. సుస్వాగతం అంటూ ఫ్లెక్సీలో రాశారు. వర్థంతికి స్వాగతం అని ఎలా రాస్తారని, ఆ ఫ్లెక్సీ డిజైన్ చేసివారికే తెలియాలన్నారు. అది చూస్తే ఎవరికైనా కోపం వస్తుందని, బాలకృష్ణ విషయంలో కూడా ఇదే జరిగిందని చెబుతున్నాయి. బాలయ్య విషయంలో పూర్తిగా ఇది బయటకు రాకపోవడంతో జూనియర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగించమన్నాడంటూ వార్తలు వస్తున్నాయన్నాయి. అయితే బాలయ్య ఎందుకు అలా మాట్లాడాడు? ఆ ఫ్లెక్సీలో ఉన్న తప్పును పూర్తిగా గమనించి అభిమానులంతా అర్థం చేసుకోవాలని టీడీపీ వర్గాలు సూచిస్తున్నాయి.












Click it and Unblock the Notifications