శాతకర్ణి ఉత్సాహం: స్వగ్రామంలో బాలయ్య సంక్రాంతి సంబరాలు
గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ఘన విజయం సాధించడంతో ఉత్సాహంలో ఉన్న నందమూరి బాలకృష్ణ అదే ఉత్సాహంతో సంక్రాంతి పండగను జరుపుకుంటున్నారు.
విజయవాడ: ఇటీవల విడుదలైన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ఘన విజయం సాధించడంతో ఉత్సాహంలో ఉన్న టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అదే ఉత్సాహంతో సంక్రాంతి పండగను జరుపుకుంటున్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని కొమరవోలు, నిమ్మకూరులో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.
మొదట నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి స్వగ్రామానికి ఎడ్లబండిపై ప్రదర్శనగా వెళ్లారు. చిన్నారులకు భోగిపళ్లు పోశారు. ధాన్యం రాశులకు పూజలు చేసి రైతులను సన్మానించారు.

అనంతరం పశుప్రదర్శనను వీక్షించారు. సంక్రాంతి పండగకు సొంత గ్రామానికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను ఆదరించిన అభిమానులకు, ప్రేక్షకులకు ఈ సందర్భంగా బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
చారిత్రక కథ ఉన్న సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వినోద పన్ను రాయితీ ఇవ్వడం శుభ పరిణామమని చెప్పిన బాలకృష్ణ, ఇద్దరు సీఎంలకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. బాలకృష్ణ వెంట రాష్ట్రమంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, స్థానిక ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, టిడిపి నేత వర్ల రామయ్య తదితరులు ఉన్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications