ప్రాణం ఖరీదు రూ.16 కోట్లు.."ఆయుష్మాన్ భవా" అంటూ అండగా బాలయ్య !
ఏపీలోని హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి కేయాన్ష్ అద్విక్.. ప్రస్తుతం ప్రాణాంతక అరుదైన వ్యాధి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్ఎంఏ) టైప్-2తో పోరాడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా చిన్నారి శరీరంలోని కండరాలు క్రమంగా బలహీనపడుతూ.. శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితి తెలిసిన స్థానిక ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
రూ.16 కోట్ల ఇంజెక్షన్..
కాగా చిన్నారి చికిత్సకు అవసరమైన జీవరక్షక ఔషధం "AVXS-101 (ఒనాసెమ్‌నోజిన్ అబెపార్వోవెక్)" అని వైద్యులు సూచించారు. ఈ ఇంజెక్షన్ ఒక్కసారి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీని ధర సుమారు రూ.16 కోట్లు ఉండటం వల్ల ఇది సాధారణ కుటుంబాలకు మోయలేని భారంగా మారింది. అంతే కాకుండా భారతదేశంలో ఈ ఔషధం తయారుకాకపోవడం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

21 నెలలుగా ప్రాణాలతో పోరాటం..
నటరాజు దంపతుల కుమారుడైన కేయాన్ష్ అద్విక్ గత 21 నెలలుగా ఈ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నాడు. మొదట్లో సాధారణ సమస్యగా భావించిన ఈ వ్యాధి, తరువాత తీవ్రరూపం దాల్చడంతో వైద్య పరీక్షలు చేయగా ఎస్ఎంఏ టైప్-2గా నిర్ధారణ అయింది. చిన్నారి రోజువారీ జీవనం కూడా కష్టంగా మారడంతో కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది.
బాలకృష్ణ స్పందన..
చిన్నారి కుటుంబం ఇటీవల హిందూపురం పర్యటనలో ఉన్న నందమూరి బాలకృష్ణను కలిసి తమ పరిస్థితిని వివరించింది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి, తన వంతు సహాయం అందించడమే కాకుండా ప్రభుత్వ స్థాయిలో కూడా మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
అలానే సోషల్ మీడియాలో ఆయన చేసిన విజ్ఞప్తి ప్రజల హృదయాలను కదిలించింది. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి చిన్నారి ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు. సహాయం అందించాలనుకునే వారి కోసం చిన్నారి తండ్రి బ్యాంక్ వివరాలను కూడా పంచుకున్నారు:
ఖాతా పేరు: A S నటరాజు
ఖాతా సంఖ్య: 8265662545
ఐఎఫ్ఎస్‌సి కోడ్: IDIB000J028
శాఖ: జేపీ నగర్
ఈ వివరాల ద్వారా దేశం నలుమూలల నుంచి విరాళాలు అందుతున్నట్లు సమాచారం.
సామాజిక మద్దతుపై ఆశలు..
గతంలో కర్నూలు జిల్లాకు చెందిన పునర్విక అనే చిన్నారికి కూడా ఇదే వ్యాధి సోకినప్పుడు, ప్రజలు కలిసి భారీగా నిధులు సేకరించి ఆమె ప్రాణాలను కాపాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేయాన్ష్ కోసం కూడా అలాంటి ప్రజా మద్దతు లభిస్తుందనే ఆశతో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
ఇక నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అనేక మంది పేదలకు వైద్య సహాయం అందిస్తున్నారు. ఇప్పుడీ చిన్నారి కోసం కూడా ఆయన చేసిన పిలుపు, ఆయన మానవత్వాన్ని మరోసారి చాటిచెప్పింది. ఈ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు సమాజం మొత్తం ముందుకు రావాల్సిన అవసరం ఉందని.. చిన్న చిన్న విరాళాలు కూడి పెద్ద సహాయంగా మారతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ చేయగలిగిన సహాయం చేయాలని కోరుతున్నారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications