తారకరత్న ఆరోగ్యంపై అప్ డేట్ ఏది?

తారకరత్నకు ప్రాణాపాయం తప్పిపోయినట్లు సమాచారం రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నందమూరి తారకరత్న గుండెపోటుతో ఆసుపత్రి పాలై రెండు వారాలు దాటింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం రోజు కుప్పంలో తారకరత్న కూడా అడుగు కదిపారు. తర్వాత ఆసుపత్రి పాలైనపుడు ప్రాణాలు నిలవడం కష్టం అన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. కొద్దిరోజుల తర్వాత తారకరత్నకు ప్రాణాపాయం తప్పిపోయినట్లు సమాచారం రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చేరిన తర్వాత వరుసగా వారం రోజులపాటు ఎప్పటికప్పుడు అతని ఆరోగ్యం గురించి ‌‌అప్‌డేట్స్ వస్తుండేవి. చికిత్స జరుగుతున్న నారాయణ హృదయాలయ వైద్యులు కూడా కొన్ని రోజులు అధికారికంగా తారకరత్న ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇచ్చారు. కానీ గత పది రోజులుగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఏ సమాచారం బయటకు రావడంలేదు.

nandamuri tarakaratna health update

నెమ్మదిగా ప్రజలు కూడా తారకరత్న ఆరోగ్యంపై దృష్టి మళ్లించారు. అయితే తెలుగుదేశం పార్టీలోను, ఆ పార్టీ అభిమానుల్లోను తారకరత్న ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. అవసరమైతే విదేశాలకు తరలించాలని కుటుంబ సభ్యులు భావించినప్పటికీ చికిత్సకవసరమయ్యే అన్ని సౌకర్యాలు ఇక్కడే ఉండటంతో విదేశీ వైద్యులనే ఇక్కడికి రప్పించారు.

ఈ మేరకు నందమూరి కుటుంబ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. తారకరత్న గుండె, ఇతర అవయవాలు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ.. మెదడు దెబ్బ తినడం సమస్యగా మారినట్లు తెలుస్తోంది. దాదాపుగా అతను కోమా స్థితికి దగ్గరగా వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బ్రెయిన్ రికవరీ చేసి అతణ్ని సాధారణ స్థితికి తేవడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం విదేశీ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అత్యాధునికి చికిత్సా పద్ధతులను అనుసరిస్తున్నారు. తారకరత్న తొందరగా కోలుకోవాలని పార్టీ అభిమానులు, నందమూరి కుటుంబ అభిమానులు కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+