వాట్సాప్ గ్రూప్‌లో న్యూడ్ వీడియో: వైస్ చైర్మన్‌పై కేసు, వాంటెడ్‌గా పెట్టారా?
టిడిపి కౌన్సిలర్ల వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో పెట్టిన నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ పైన వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా కౌన్సెలర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చర్యలు చ
కర్నూలు: టిడిపి కౌన్సిలర్ల వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో పెట్టిన నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ పైన వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా కౌన్సెలర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చర్యలు చేపట్టారు.
అయితే, తాను ఆ వీడియో పెట్టలేదని విజయ్ కుమార్ చెబుతున్నారు. అయితే, మహిళా కౌన్సెలర్లు మాత్రం.. వాంటెడ్‌గా పెట్టినట్లు కనిపిస్తోందన్నారు. ఆయన సెల్‌లో ఉన్న వీడియోలను, ఆయన ఫోన్ నుంచి ఎవరు పెడతారని మహిళా కౌన్సెలర్లు ప్రశ్నిస్తున్నారు. అది ఆయనకే తెలియాలన్నారు.

ఫోన్ టేబుల్ పైన పెడతాను
తాను తన ఫోన్‌ను టేబుల్ పైన పెట్టి వెళ్లే అలవాటు ఉందని, కాబట్టి ఎవరో అవతలి పార్టీ వాళ్లు తనను బద్నాం చేయడానికి ఇలా చేసి ఉంటారని అంటున్నారు. ముప్పై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని కానీ తన పైన ఎలాంటి ఆరోపణలు లేవన్నారు.
రెండు రోజుల క్రితం న్యూడ్ వీడియో
వాట్సాప్ గ్రూప్‌లోకి వైస్ చైర్మన్ నెంబర్ నుంచి న్యూడ్‌గా ఉన్న స్త్రీ డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న వీడియో రెండు రోజుల క్రితం వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. మహిళా కౌన్సెలర్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. నంద్యాల పురపాలకసంఘం ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్న విజయ్ కుమార్ అశ్లీల దృశ్యాలను రెండు రోజుల క్రితం మహిళా కౌన్సిలర్లు ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశారు.
దీనిపై నంద్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ దేశం సులోచన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఛైర్ పర్సన్‌తో పాటు మహిళా కౌన్సిలర్లు శోభారాణి, చాంద్‌బీ, కన్నమ్మ, కో-ఆప్షన్ సభ్యురాలు మాహబున్నీసాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నంద్యాల టిడిపి పేరుతో ఒక మహిళా కౌన్సిలర్ నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూప్‌లో గత రెండు రోజుల క్రితం ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్ ఫోన్ నుంచి అశ్లీల దృశ్యం అప్‌లోడ్ చేశారు.
ఈ ఘటన మహిళలను కించపరిచే విధంగా ఉందని, హేయమైన చర్యగా పేర్కొంటూ విజయ్ కుమార్‌పై పోలీసులకు, పార్టీ అదిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు మహిళా కౌన్సిలర్లు తెలిపారు. వెంటనే విజయ్ కుమార్ పదవి నుంచి వైదొలగాలని వారు డిమాండ్ చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications