బ్రేకింగ్ న్యూస్: ఎవరూ ఊహించని మల్టీస్టారర్ కాంబినేషన్
సూపర్ స్టార్ రజనీకాంత్, మరో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ ఒకటి రూపుదిద్దుకుంటోంది. అయితే ఇంకో స్టార్ హీరో కూడా ఇందులో నటిస్తున్నారు. ఆయనే నాని. రజనీ, అమితాబ్, నాని కాంబినేషన్ ను ఎవరూ ఊహించి ఉండరు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
తమిళ హీరో సూర్యతో 'జై భీమ్' లాంటి మంచి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్. ఆయన రజనీకాంత్‌తో సినిమా చేస్తున్నారు. ఇది రజనీకి 170వ చిత్రం. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో చక్కర్లు కొడుతోంది. ఒకరకంగా ఆయా ఇండస్ట్రీల్లో చర్చనీయాంశమైంది.

ప్రముఖ మలయాళ నటీనటులు ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ సైతం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. కొద్దిరోజుల క్రితం రజనీకాంత్ ను నాని డైరెక్ట్ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే అది జరగలేదు. తాజాగా తలైవాతో కలిసి నటించే అవకాశం కొట్టేశారని ప్రచారం నడుస్తోంది. ఇది ప్రచారమేనా? లేదంటే నిజంగా ఆ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటిస్తుందా? అనేదానిపై స్పష్టత రావాలంటే కొద్దిరోజులు ఆగక తప్పదు. ప్రస్తుతం హాయ్ నాన్న పాన్ ఇండియా సినిమాతో నాని బిజీగా ఉన్నారు.
రజనీకాంత్ 'జైలర్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈనెల 10న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. రజనీకాంత్ గత చిత్రాలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో తెలుగులో దీనిపై బజ్ లేదు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించడంతో ఆయన ఏమైనా మ్యాజిక్ చేస్తారేమోనని రజనీ అభిమానులు ఆశిస్తున్నారు.తన 170వ సినిమా కోసం రజనీకాంత్ సిద్ధమయ్యారు. సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్.. రజనీకాంత్‌కు స్టైలింగ్ చేశారు.












Click it and Unblock the Notifications