అర్జున్ టెండుల్కర్ పెళ్లిలో తళుక్కున మెరిసిన నారా లోకేష్ దంపతులు

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్- తన ప్రేయసి సానియా చందోక్‌ను వివాహ వేడుకులు ముంబైలో గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టెండూల్కర్ కుటుంబంలో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. క్రీడా, రాజకీయ, పారిశ్రామిక, సినిమా రంగాలకు చెందిన హేమాహేమీలందరూ ఈ పెళ్లికి తరలివస్తోన్నారు. వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తోన్నారు.

ఈ వేడుకకు మాజీ క్రికెటర్లు జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, అజింక్య రహానే తమ జీవత భాగస్వాములతో విచ్చేశారు. యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ నలుపు దుస్తుల్లో, సురేశ్ రైనా తన భార్య ప్రియాంక చౌదరితో సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. సునీల్ గవాస్కర్ దంపతులు గోల్డెన్-బీజ్ దుస్తులలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే సైతం వచ్చి దంపతులను ఆశీర్వదించారు. నట-దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ ఐవరీ కుర్తా, నెహ్రూ జాకెట్‌లో సందడి చేశాడు.

Nara Lokesh and Brahmani joins Star-Studded Arjun Tendulkar Saaniya Chandok Wedding Reception Mumbai

భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తన భార్య విజేతా పెంధార్కర్ తో కలిసి ఈ గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు అటెండ్ అయ్యాడు. లెజెండరీ ప్లేయర్ రవిశాస్త్రి, బీసీసీఐ కార్యదర్వి జై షా, దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ అంబానీ, ఆయన నీతా అంబానీ, కొడుకు ఆకాష్, శ్లోకా అంబానీలు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ చాలా కాలం తర్వాత జంటగా దర్శనం ఇచ్చారు. అందరి దృష్టిని ఆకర్షించారు.

ఇదే వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి. అర్జున్ టెండుల్కర్, సానియా చందోక్ కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను ఆప్యాయంగా పలకరించారు. సచిన్ టెండుల్కర్ కు విషెస్ చెప్పారు. ముఖేష్ అంబానీ, జై షాలను కలిశారు. వారితో చాలా సేపు మాట్లాడటం కనిపించింది. వారందరితో సరదాగా గడిపారు నారా లోకేష్.

గత ఏడాది ఆగస్టులో అర్జున్ టెండుల్కర్, సానియా చందక్ నిశ్చితార్థం సీక్రెట్‌గా జరిగిన సంగతి తెలిసిందే. సారా టెండూల్కర్‌కు సానియా చందోక్ క్లోజ్ ఫ్రెండ్. సారా ద్వారానే ఆమె అర్జున్‌కు పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత ఏడాది ఆగస్టులో ముంబైలో కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ ఎంగేజ్మెంట్ జరిగింది. సానియా చందోక్.. ముంబైకి చెందిన వ్యాపారి రవి ఘాయ్ మనవరాలు. ఆమె కుటుంబం.. హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ రంగంలో కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+