భర్తగా గర్విస్తున్నా.. నారా బ్రాహ్మాణిపై లోకేష్ ప్రశంసలు..!
ఏపీ మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్నారు. ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ 'బిజినెస్ టుడే' ప్రతి ఏడాది నిర్వహించే.. అవార్డులలో భాగంగా ఆమెకు 'మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్' అవార్డు లభించింది. వ్యాపార రంగంలో మహిళల నాయకత్వం, సంస్థల అభివృద్ధిలో వారి పాత్రను గుర్తిస్తూ ఈ పురస్కారం అందజేస్తారు. ఈ క్రమంలో నారా బ్రాహ్మణి ఎంపిక కావడం వ్యాపార వర్గాల్లోనే కాకుండా ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
హెరిటేజ్ ఫుడ్స్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నారా బ్రాహ్మణి.. సంస్థ విస్తరణ, బ్రాండ్ బలోపేతం, రైతులతో అనుసంధానం వంటి కీలక అంశాల్లో తనదైన ముద్ర వేశారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ హెరిటేజ్ ఫుడ్స్‌ను మరింత బలమైన సంస్థగా తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతే కాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ సంస్థను నడిపిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

ఈ మేరకు అవార్డు దక్కిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ భార్యపై ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా.. భర్తగా గర్విస్తున్నాను అని పోస్ట్ చేశారు. నాయకత్వం అంటే నిశ్శబ్దంగా సంస్థలను నిర్మించడం, దీర్ఘకాలికంగా ఆలోచించడం, మాటలకన్నా పని మాట్లాడేలా చేయడం అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. బ్రాహ్మణి ఆలోచనలకు ఇది తగిన గుర్తింపు అని ట్వీట్ చేశారు.
అంతే కాకుండా వ్యాపార రంగంలో మహిళల ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో.. నారా బ్రాహ్మణి వంటి నాయకులకు ఈ తరహా పురస్కారాలు మరింత ప్రేరణనిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. యువతికి, ముఖ్యంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే మహిళలకు ఆమె ఒక ఆదర్శంగా నిలుస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుటుంబ బాధ్యతలు, వ్యాపార నిర్వహణ రెండింటినీ సమర్థవంతంగా సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్న నారా బ్రాహ్మణి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోందని పేర్కొంటున్నారు.
Proud husband moment 😊
— Lokesh Nara (@naralokesh) December 13, 2025
Brahmani’s idea of leadership has always been about building quietly, thinking long-term, and letting work speak louder than words. This is a deserved recognition at the @business_today awards. https://t.co/oJbc9YiUaN
ఇక 'బిజినెస్ టుడే - మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్' అవార్డు నారా బ్రాహ్మణి వ్యక్తిగత విజయంతో పాటు, హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచిందని చెప్పవచ్చు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications