Nara Lokesh: తాడేపల్లి తలుపులు బద్దలుకొడతాం-మూడునెలల్లో ప్రజాస్వామ్య పాలనన్న లోకేష్..
ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర, కొండంత అండ కోస్తాంధ్ర, రత్నాలసీమ రాయలసీమ, అందరి విశాఖ...అందాల విశాఖ అంటూ నారా లోకేష్ యువగళం-నవశకం బహిరంగ సభలో ప్రసంగాన్ని ప్రారంభించారు. బొమ్మ బ్లాక్ బస్టర్ గురూ! ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి ప్యాలస్ లో టివిలు పగులుతాయో ఆ బొమ్మ నేను మీకు చూపిస్తున్నా అంటూ లోకేష్ ఉత్సాహంగా ప్రసంగం చేశారు. విజనరీ చంద్రబాబు గారు, పవర్ ఫుల్ పవనన్న, మన సింహం బాలయ్య బొమ్మ అదుర్స్ కదూ అన్నారు.
ఇది యువగళం ముగింపు సభ కాదు...ఇది ఆరంభం. ఇది నవశకం అని నారా లోకేష్ తెలిపారు. యుద్ధం మొదలైందని, తాడేపల్లి ప్యాలస్ గోడలు బద్దలు కొడదామని లోకేష్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటమని,రాక్షసరాజ్యంలో పాదయాత్ర చెయ్యడం ఒక విప్లవమన్నారు. యువగళం పాదయాత్ర కుప్పంలో మొదలుపెట్టానని, 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2100 గ్రామాలు, 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని లోకేష్ తెలిపారు. యువగళాన్ని ఆపేందుకు జగన్ జిఓ.1 తీసుకొచ్చారని, ఆ రోజే దాన్ని ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో తగ్గేదేలేదు అని చెప్పానన్నారు.

తనది అన్న ఎన్టీఆర్ గారు ఇచ్చిన గొంతు అని, దీన్ని ఆపే మగాడు ఇంకా పుట్టలేదన్నారు. పోలీసుల్ని పంపినా యువగళం ఆగలేదని, వైసీపీ గూండాలను పంపినా పసుపు సైన్యాన్ని చూసి పారిపోయారని లోకేష్ తెలిపారు. బాంబులకే భయపడని బ్లడ్ మనది, బెదిరింపులకు భయపడతామా? భయం మా బయోడేటాలో లేదు బ్రదర్ అన్నారు.సాగనిస్తే పాదయాత్ర...అడ్డుకుంటే దండయాత్ర అని తొలిరోజే తాను చెప్పానన్నారు.
జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు అయితే.. మీ లోకేష్ ది అంబేద్కర్ గారి రాజ్యాంగం పౌరుషమన్నారు. ఒక పక్క యువగళం, మరో పక్క చంద్రబాబు భవిష్యత్తుకి గ్యారెంటీ, పవనన్నవారాహి యాత్ర తో జగన్ కి, ఫ్యాన్ కి ఉక్కపోత మొదలైందని లోకేష్ తెలిపారు. చంద్రబాబును చూస్తే జగన్ భయం, పవనన్నని చూస్తే జగన్ కి భయం, మీ లోకేష్ ని చూస్తే జగన్ కి భయం అన్నారు. అందుకే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు బంధించారన్నారు.
విజనరీ అంటే చంద్రబాబు, ప్రిజనరీ అంటే జగన్ ఇది ఫిక్స్ అని లోకేష్ తెలిపారు. జగన్ అరెస్ట్ అయితే రోజుకో స్కామ్ బయటపడిందన్నారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే 15 ఏళ్లు సీఎం గా ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం బయటకు వచ్చిందన్నారు. 53 రోజులు నిజాన్ని బంధించారు. కానీ ఆఖరికి నిజమే గెలిచిందన్నారు. పవనన్న ఏపీకి వస్తుంటే వైసిపి పిరికి సన్నాసులు అడ్డుకుంటారని, ఆయన రావాలి అనుకున్న ఫ్లయిట్ క్యాన్సిల్ చేస్తారని గుర్తుచేశారు. పవనన్నని ఏపీ బోర్డర్ లో ఆపేస్తారన్నారు. ప్రజాస్వామ్యాన్ని నువ్వు దెబ్బతీసావ్...ప్రజాస్వామ్యం తిరగబడి దెబ్బకొడితే ఎలా ఉంటుందో నువ్వు త్వరలోనే చూస్తావ్ అని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

జగన్ పేదలకు - పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నారని, లక్ష కోట్లు దోచిన వాడు, లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా? అని లోకేష్ ప్రశ్నించారు. జరగబోయేది జగన్ అహంకారానికి - ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధమన్నారు. జగన్ అహంకారాన్ని 151 అడుగుల గొయ్యి తీసి పాతిపెడతానన్నారు. జగన్ ఒక అప్పుల అప్పారావు, ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టాడని, అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని నాశనం చేసాడన్నారు.
జగన్ ఐపీఎల్ టీము పెడతామంటున్నారని, దీనికి కోడికత్తి వారియర్స్ అని పేరు పెడితే బాగుంటుందని లోకేష్ సూచించారు.సీనియర్ బ్యాట్స్ మెన్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి, ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ భరత్, బూతుల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టర్ బియ్యం మధు.అబ్బో మామూలు టీము కాదన్నారు. పాదయాత్ర తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, నాయకుడు ఎంత బాధ్యతగా ఉండాలో తెలుసుకున్నానన్నారు.చివరిగా పవనన్న పవర్ ఫుల్ డైలాగ్ కూడా చెప్పాలి కదా హలో ఏపీ ... బై బై వైసిపి. హలో ఏపీ ... బై బై వైసీపీ అని ముగించారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications