Nara Lokesh: డిప్యూటీపై తేల్చేసిన లోకేష్- త్వరలో రాజీనామా..!
ఏపీలో కూటమి ప్రభుత్వంలో మంత్రిగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ పార్టీలో పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఓ దశలో కూటమిలో మిత్రపక్షం జనసేన కూడా వీటిపై కౌంటర్లు ఇచ్చింది.
చివరికి పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని లోకేష్ కు డిప్యూటీ సీఎం ప్రచారం ఆపాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో నేతలు కాస్త శాంతించారు. ఈ నేపథ్యంలో తనకు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ పై లోకేష్ ఇవాళ స్పందించారు.

తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ వచ్చిన డిమాండ్లపై విశాఖ కోర్టుకు హాజరైన సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదని చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తద్వారా చంద్రబాబు డిప్యూటీ సీఎం ఇస్తే మాత్రం తీసుకుంటా అనే అర్ధం వచ్చేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయి. మరోవైపు ఒకే వ్యక్తి ఒకే పదవిలో మూడుసార్లు కొనసాగడం సరికాదనేది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ లోకేష్ మరోసారి వ్యాఖ్యానించారు.
పార్టీలో ఒక వ్యక్తి, ఒకే పదవిలో మూడు పర్యాయాలకు మించి ఉండకూడదనేది తన వ్యక్తిగత అభిప్రాయం అని, దీనిపై పార్టీ నేతలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా తాను కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకోబోతున్నట్లు లోకేష్ వెల్లడించారు. అలాగే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సైతం మూడోసారి ఎంపీ పదవిలో ఉన్నందున, ఈసారి మరో పదవి తీసుకుంటానని తనకు దావోస్ లో చెప్పినట్లు లోకేష్ వెల్లడించారు. అలా జరిగితేనే పార్టీలో అందరికీ అవకాశాలు వస్తాయన్నారు. అలాగే గ్రామ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకూ పార్టీలో కొత్త రక్తం వచ్చి చేరుతుందన్నారు.












Click it and Unblock the Notifications