ఆంధ్రుల మనోభావాలంటే జగన్‌కు లెక్కలేదు.. ఏపీ సీఎంపై లోకేశ్ నిప్పులు
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఏపీ రాజధానిపై జగన్ కుట్ర పన్నారని మండిపడ్డారు. ప్రజలు నిర్మించుకొంటున్న రాజధానిని .. కాదు అనే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ మేరకు జగన్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు నారా లోకేశ్. రాజధానిపై జగన్ వైఖరి సరికాదని .. కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలంటే సీఎం జగన్‌కు లెక్కలేదని విమర్శించారు లోకేశ్. తన సొంత ఇంటిని వందల కోట్లతో నిర్మించుకుంటారని .. అదే రాష్ట్ర ప్రజల కోసం అద్భుత రాజధాని మాత్రం అక్కర్లేదా అని ప్రశ్నించారు. అమరావతి రాజధానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయం విషయంలో నెలరోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్నో లెటర్లు రాసిందని గుర్తుచేశారు. ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని సమాచారం ఇచ్చారు. కానీ చివరి సెకనులో కూడా హెచ్చరించింది. కానీ వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిందని దుమ్మెత్తిపోశారు.

అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపే హక్కు మీకు ఎక్కడిదని లోకేశ్ ప్రశ్నించారు. మీ సొంత ఇళ్లను వందల కోట్లతో నిర్మించుకున్నారని .. అదే రాష్ట్ర ప్రజల కోసం ఒక అద్భుత రాజధాని నిర్మిస్తుంటే అక్కర్లేదు అన్నట్టు దుర్మార్గపు ఆలోచన ఎందుకు చేస్తున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు. అమరావతి రాజధానిపై జగన్ ప్రభుత్వ వైఖరి సరికాదని విమర్శించారు. ఇప్పటికైనా ఆలోచన మార్చుకోవాలని సూచించారు. లేదంటే ప్రజలే ప్రభుత్వానికి బుద్దిచెబుతారని గుర్తుచేశారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications