జగన్ కోసం పని చేస్తున్న వైసీపీ కార్యకర్తకు లోకేష్ సాయం!

రాజకీయాల్లో సహజంగా తమ పార్టీ, తమ పార్టీ కార్యకర్తలు వారి సంక్షేమం, వారి అవసరాలు వంటి వాటికే నాయకులు ప్రాధాన్యత ఇస్తారు. పక్క ప్రత్యర్థి పార్టీ వారి సమస్యలను వినాలని కూడా అనుకోరు. కానీ ఏపీ రాజకీయాల్లో తాజాగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాజకీయాలకు అతీతంగా, మానవత్వం చాటుకుంటూ మంత్రి నారా లోకేష్ చేసిన పని ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

వైసీపీ కార్యకర్తకు లోకేష్ సాయం

కష్టాలలో ఉన్న వైసీపీ కార్యకర్తకు ఆయన తన చేయూతనిచ్చారు. తమ పార్టీ కాదు అన్న బేధ భావం మరచి సహాయం చేశారు మంత్రి నారా లోకేష్. సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టుకు ఆయన స్పందించారు. అది కూడా జగన్ తో కలిపి తనను ట్యాగ్ చేసినా, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవటం ముఖ్యమని భావించి సహాయం అందించారు.

Nara Lokesh Helps YSRCP Worker ys jagan supporter is in Trouble Responds on Social Media post

తండ్రి ఆరోగ్యం కోసం సోషల్ మీడియాలో పోస్ట్

వైసీపీ కార్యకర్త భాస్కర్ అనే వ్యక్తి తండ్రికి ఇటీవల ప్రమాదం జరగటంతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వైద్యానికి సరిపడా ఆర్ధిక పరిస్థితి లేకపోవటంతో తనకు సహాయం చెయ్యమని ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

జగన్ తో పాటు లోకేష్ ను ట్యాగ్ చేస్తూ వైసీపీ కార్యకర్త పోస్ట్

తన తండ్రి స్థితి వివరిస్తూ, మీ కోసం, పార్టీ కోసం నాకున్న శక్తి మేరకు కష్టపడుతున్నా వైఎస్ జగన్ అన్నా, మా నాన్న గారికి యాక్సిడెంట్ ఆయీ, ఆస్పతిలో ఉన్నారు. నా శక్తి మేరకు ఖర్చు పెట్టాను. ఇంకా ఆర్ధికంగా ఇబ్బందిగా ఉంది, కొంచెం అండగా నిలబడి ఆదుకోండి అంటూ పోస్ట్ పెట్టారు. ఇక ఆ ట్వీట్ లో వైఎస్ జగన్ తో పాటు నారా లోకేష్ ను కూడా ట్యాగ్ చేశారు.

స్పందించిన మంత్రి లోకేష్ .. ఆపన్న హస్తం

దీంతో లోకేష్ సానుకూలంగా స్పందించారు. "మీ నాన్నగారికి జరిగిన ప్రమాదం గురించి విని బాధపడ్డాను భాస్కర్. ఆయన త్వరగా, పూర్తిగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ నాన్నకు అవసరమైన సహాయాన్ని ఎలా అందించాలో మా టీమ్ చూసుకుంటుంది" అని లోకేష్ మళ్ళీ భాస్కర్ కు ట్వీట్ చేశారు.

వైసీపీ కార్యకర్త లోకేష్ కు అన్నా అంటూ థ్యాంక్స్

మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు, ఆయన బృందం వైఎస్సార్‌సీపీ కార్యకర్త భాస్కర్‌ను వెంటనే సంప్రదించి, అవసరమైన సహాయ చర్యలు చేపట్టారు. ఈ అనూహ్య సాయం అందుకున్న భాస్కర్, థ్యాంక్యూ.. నారా లోకేష్ అన్నగారు అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. పార్టీ చూడకుండా మా నాన్న గారి పరిస్థితి గురించి నేను చెప్పిన వెంటనే , ఒక అన్నలా సహాయం చెయ్యడానికి ముందుకి వచ్చారు అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+