నేతల మధ్య సహజం: గొడవపై లోకేష్, బీజేపీతో పొత్తు-కేశినేనిలపై ఆసక్తికరం
ప్రకాశం జిల్లా నేతల మధ్య విభేదాలపై మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ స్పందించారు. నేతల మధ్య అభిప్రాయబేధాలు సహజమని చెప్పారు.
అమరావతి: ప్రకాశం జిల్లా నేతల మధ్య విభేదాలపై మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ స్పందించారు. నేతల మధ్య అభిప్రాయబేధాలు సహజమని చెప్పారు. అయితే బహిరంగ విమర్శలు చేయకుండా పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించాలన్నారు.
ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయుల హత్య, తదనంతర పరిణామాలు టిడిపి అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. మంగళవారం ఉదయం ఒంగోలులో కరణం, ఎమ్మల్యే గొట్టిపాటి రవికురమార్ నెట్టివేసుకున్నారు.

పోలీసులు విచారిస్తున్నారు
దీనిపై లోకేష్ మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో జరిగిన హత్యలపై పోలీసులు విచారణ జరుపుతున్నారని తలిపారు. అదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేల అంశంపై స్పందించారు.

ప.గో. ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు లేదు
పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేల్లో ఎలాంటి తిరుగుబాటు లేదని నారా లోకేష్ తెలిపారు. వారి మనోభావాలు దెబ్బతినడం వల్ల కొంత ఆవేదన చెందారని చెప్పారు. జిల్లా పోలీస్ బాస్ వద్దంటూ 12 మంది ఎమ్మెల్యేలు గన్‌మెన్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

కేశినేని నాని వ్యక్తిగతం
బీజేపీతో పొత్తు అంశంపై జరుగుతున్న చర్చ పైన కూడా నారా లోకేష్ స్పందించారు. బీజేపీతో పొత్తు వల్లే తనకు ఓట్లు రాలేదని, వచ్చే ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే అంతకు డబుల్ మెజార్టీ సాధిస్తానని కేశినేని నాని అన్నారు. దీనిపై లోకేష్ మాట్లాడారు. కేశినేని నాని వ్యాఖ్యలు వ్యక్తిగతం అని చెప్పారు.

పొత్తుపై చర్చిస్తాం
బిజెపితో పొత్తు అంశంపై మహానాడులో చర్చిస్తామని లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపితో పొత్తుపై చర్చిస్తామని చెప్పడం ద్వారా.. బిజెపి లాగే టిడిపి కూడా పొత్తు విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications