బ్రాహ్మణికి నారా లోకేష్ సంక్రాంతి స్పెషల్ కానుక.. సంబరపడిన మంగళగిరి!
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెలలోనూ, పట్టణాలలోనూ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇక ప్రతి సంక్రాంతికి నారావారిపల్లెలో సందడి చేసే చంద్రబాబు కుటుంబం ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ నారావారిపల్లెలో సంబరాలు జరుపుకుంది.
బ్రాహ్మణికి లోకేష్ గిఫ్ట్
సంక్రాంతి సందర్భంగా మంత్రి లోకేష్ తన సతీమణి బ్రాహ్మణికి ఇచ్చిన ఒక బహుమతి ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మంగళగిరి వాసుల ఆనందానికి కారణమైంది. సంక్రాంతి పండుగ వేళ కుటుంబంతో సహా నారావారిపల్లెకు వెళ్ళిన మంత్రి లోకేష్ అక్కడ తన భార్య బ్రాహ్మణి కి ఒక బహుమతిని ఇచ్చారు. మంగళగిరి చేనేత చీరను సంక్రాంతికి స్పెషల్ గిఫ్ట్ గా ఇచ్చి ఆమెను ఆశ్చర్యానికి గురి చేశారు.

సంక్రాంతికి లోకేష్ శుభాకాంక్షలు
సంక్రాంతి పండుగ సందర్భంగా నారా బ్రాహ్మణి నారా లోకేష్ గిఫ్ట్ గా ఇచ్చిన మంగళగిరి పట్టు చీర కట్టుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ సందర్భంగా నారావారిపల్లెలో వేడుకలలో పాల్గొన్న నారా లోకేష్ తాను ఎక్కడ ఉన్నా మనసంతా మంగళగిరిలోనే ఉంటుందని తన నియోజకవర్గ ప్రజలను గుర్తు చేసుకున్నారు. తెలుగు వారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.
మంగళగిరి వాసులు మురిసిపోయే కానుక
సంక్రాంతి రైతుల పండుగ అని, పాడిపంటలు ఇంటికొచ్చి, పల్లెలన్నీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కొత్త శోభను సంతరించుకుంటాయి అంటూ పేర్కొన్నారు. తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ, సాంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ సంబరాల సంక్రాంతిని ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మొత్తంగా మంగళగిరి చీరను గిఫ్ట్ ఇవ్వడంతో, మంగళగిరి చేనేత కార్మికులు నారా లోకేష్ ఇచ్చిన బహుమతి పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నారావారిపల్లెలో సందడి చేసిన చంద్రబాబు ఫ్యామిలీ
అంతే కాదు తాను ఎక్కడ ఉన్నా మంగళగిరిలోనే తన మనసు ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు మంగళగిరి వాసుల మనసులను కొల్లగొట్టాయి. ఇది ఇలా ఉంటే నారావారి పల్లెలో చంద్రబాబు కుటుంబం అక్కడి గ్రామస్థులతో కలిసి సందడి చేసింది. నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ అక్కడ ఆటల పోటీలలో స్థానికంగా ఉన్న పిల్లలతో పోటీ పడ్డాడు. చంద్రబాబు, భువనేశ్వరి మనవడి ఆట తీరును చూసి తెగ సంబరపడ్డారు. బంధు మిత్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో చంద్రబాబు ఫ్యామిలీ సంక్రాంతి జరుపుకుంది.












Click it and Unblock the Notifications