పవన్ కు లోకేష్ పాదాభివందనం - ఆశీర్వాదం..!! (వీడియో)

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. పవన్ - లోకేష్ చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా మారారు. ప్రమాణ స్వీకారం వేళ పలు ఆసక్తి కర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణ స్వీకార వేదిక పైన మోదీ సైతం పవన్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. చిరంజీవి - పవన్ తో కలిసి చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేసారు. మెగా-నందమూరి కుటుంబాలు సందడి చేసాయి. ఇదే సమయంలో పవన్ కు లోకేష్ వేదిక పైన పాదాభివందనం చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

పవన్ అన్నా అంటూ
చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ - లోకేష్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆ వెంటనే లోకేష్ వేదిక పైనే పవన్ కు పాదాభివందనం చేసారు. తొలుత తనకు పాదాభివందనం చేసేందుకు ప్రయత్నం చేసిన లోకేష్ ను వారించారు. కానీ, లోకేష్ ఆయన్ను ఒప్పించి పాదాభివందనం చేసారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో పవన్ వెళ్లి మద్దతు ప్రకటించారు. అక్కడే టీడీపీతో పొత్తును ఖరారు చేసారు. ఆ రోజు నుంచే టీడీపీ - జనసేన మధ్య బంధం బలపడింది.

Nara Lokesh Seeks Pawan Kalyans blessings after ministerial Oath Video Trends

పాదాభివందనం
చంద్రబాబు అరెస్ట్ సమయంలో చంద్రబాబు కుటుంబానికి పవన్ అండగా నిలిచారు. పార్టీ నేతలు సైతం ముందుకు రాని సమయంలో పవన్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఆ సమయం నుంచే నారా - నందమూరి కుటుంబానికి పవన్ పైన అభిమానం పెరిగింది. టీడీపీ కేడర్ కు పవన్ మద్దతు ఇచ్చిన తీరు నచ్చింది. ఇక..ఎన్నికల్లో ఎక్కడా సీట్ల విషయంలో చంద్రబాబును పవన్ ఇబ్బంది పెట్టలేదు. టీడీపీ, బీజేపీ మధ్య గ్యాప్ తగ్గింది. మూడు పార్టీల కూటమి గా కలపటంలో పవన్ కీలక పాత్ర పోషించారు. అంతిమంగా కూటమి అధికారంలోకి రావటంలో కీలకంగా వ్యవహరించారు.


లోకేష్ కు ఆశీర్వాదం
ఇక..తమకు అన్నింటా అండగా నిలిచిన పవన్ ను లోకేష్ అన్నగా పలు సందర్భాల్లో సంభోదించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు తరువాత తమ్ముడుగా అన్న పవన్ కు పాదాభివందనం చేసారు. పవన్ వారిస్తున్న లోకేష్ పాదాభివందనం చేసి పవన్ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అదే విధంగా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రధాని, గవర్నర్ కు పాదాభివందనం చేసేందుకు సిద్దం అవ్వగా వారు వారించారు. చంద్రబాబు నుంచి ఆశీర్వాదం పొందారు. ఇక, ఇప్పుడు పవన్ నుంచి లోకేష్ ఆశీర్వాదం తీసుకున్న వీడియో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+