లోకేష్ ను ఇంప్రెస్ చేయబోయి..ఆ రెండు ఘటనలపై మంత్రి సీరియస్..!
ఏపీలో నిన్న ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రంలో కీలక శాఖలకు మంత్రిగా, చంద్రబాబు తనయుడిగా లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సహజంగానే ఆయనపై సొంత పార్టీ టీడీపీతో పాటు రాష్ట్రంలో అధికార గణం కూడా అవసరం ఉన్నా లేకపోయినా ప్రేమ ఒలకబోస్తోంది. అయితే ఇలాంటి పనులు చేసి గతంలో వైఎస్ జగన్ ఎలాంటి పరిస్ధితి కొనితెచ్చుకున్నారో తెలిసిన నారా లోకేష్ వీటిపై సీరియస్ అయ్యారు.
నిన్న నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం జడ్పీ హైస్కూల్లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్లోని విద్యార్ధులు హ్యాపీ బర్త్ డే టూ లోకేష్ సార్ అంటూ గ్రౌండ్ లో కూర్చొని గ్రీటింగ్స్ తెలిపారు. స్కూలు టీచర్లు వీరితో ఇలా చేయించారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఎక్స్ లో నారా లోకేష్ స్పందించారు. తన పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పడంపై ధన్యవాదాలు చెబుతూనే ఇలాంటి పనులు చేయొద్దంటూ స్కూలు ఉపాధ్యాయులకు చురకలు అంటించారు.

I happened to see this. My heartfelt gratitude for the warm birthday wishes from each one of the tiny tots.
— Lokesh Nara (@naralokesh) January 24, 2025
However, I request the school management not to make children perform such gestures. Children’s time in school is valuable and should be spent in academic and… https://t.co/cVd5ir1wVU
మరోవైపు లోకేష్ బర్త్ డే సందర్బంగా నిన్న ఆయన నియోజకవర్గం మంగళగిరి పరిధిలోకి వచ్చే తాడేపల్లిలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు హంగామా సృష్టించారు. కార్లు, బైక్ లు వేసుకుని వచ్చి లోకేష్ జెండాలతో హారన్లు మోగిస్తూ హల్ చల్ చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపైనా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసం ముందు కొందరు టిడిపి కార్యకర్తలు జెండాలు పట్టుకుని నినాదాలు చేయడంపై నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. అక్కడ ఎవరెవరు నినాదాలు చేశారు అనేది విచారించాలని స్థానిక టిడిపి నేతలకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాలని, టీడీపీ కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications