సాయంత్రం లోకేష్ తో నాదెండ్ల మనోహర్ భేటీ-సీట్ల పంపకాలు-జేఏసీపై చర్చ !
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత మారిన పరిస్ధితుల్లో ఆ ప్రభావం ఎక్కువకాలం తమపై పడకుండా టీడీపీ-జనసేన ప్రయత్నిస్తున్నాయి.ఇందులో భాగంగా ఇప్పటికే ఇరు పార్టీల మధ్య పొత్తుపై ప్రకటన చేయడంతో పాటు జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. అనంతరం ఈ కమిటీ సభ్యుల ఎంపికపై ముందడుగు పడటం లేదు. దీంతో కార్యకర్తల్లో, నేతల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేష్ ను జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఇవాళ కలవబోతున్నారు.
ఇవాళ రాజమండ్రి వస్తున్న టీడీపీ నేత నారా లోకేష్ ను కలిసేందుకు జనసేన నేత నాదెండ్ల మనోహర్ బయలుదేరి వెళ్తున్నారు. సాయంత్రం లోకేష్ తో మనోహర్ భేటీ అవుతారు. వీరిద్దరి భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రావొచ్చని తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాల వ్యవహారం చర్చకు రానున్నట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టు తర్వాత మారిన పరిస్ధితుల్లో క్షేత్రస్దాయిలో కలిసి పనిచేస్తున్న ఇరు పార్టీలు.. సీట్లపై కూడా క్లారిటీ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ పోటీ చేసే స్ధానాలు, జనసేనకు కేటాయించే స్ధానాలపై లోకేష్-మనోహర్ చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా ఇరు పార్టీల మధ్య ఓ అవగాహన ఉన్న నేపథ్యంలో సీట్ల చర్చల్లో వచ్చే క్లారిటీ చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే జనసేనకు నామమాత్రపు సీట్లు కేటాయిస్తారన్న ప్రచారం నేపథ్యంలో టీడీపీ వైఖరి ఈసారి కీలకంగా మారింది. చంద్రబాబు అరెస్టు తర్వాత మారిన పరిస్ధితుల్లో ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ గెలిచి తీరాలన్న పట్టుదలగా ఉన్న టీడీపీ జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తుందన్న దానిపై ఈ పొత్తు భవిష్యత్తు ఆధారపడి ఉండబోతోంది.
అలాగే టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీపై చర్చల్ని కూడా ముందుకు తీసుకెళ్లేలా ఇవాళ లోకేష్-మనోహర్ చర్చలు ఉంటాయని తెలుస్తోంది. జనసేన వైపు నుంచి ఆరుగురు సభ్యుల్ని ఈ కమిటీ కోసం ప్రకటించారు. కానీ టీడీపీ వైపు నుంచి మాత్రం సభ్యుల ప్రకటన రాలేదు. కేవలం యనమల రామకృష్ణుడిని మాత్రమే ఎంపిక చేశారు. దీంతో టీడీపీ నుంచి మిగతా సభ్యుల ఎంపిక, దసరా తర్వాత నిర్వహించే జాయింట్ యాక్షన్ కమిటీ భేటీపై ఇరువురు నేతల చర్చల తర్వాత క్లారిటీ రానుంది.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications