పిలిచే వరకు కదలం: తండ్రి దీక్షపై నారా లోకేష్ ట్వీట్

Nara Lokesh
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, తన తండ్రి నారా చంద్రబాబు నాయుడి నిరాహార దీక్షపై నారా లోకేష్ ట్విట్టర్‌లో స్పందించారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెసు తీసుకున్న నిర్ణయంపై చర్చించడానికి ఇరు ప్రాంతాల నేతలను చర్చలకు పిలిచే వరకు దీక్షా శిబిరం నుంచి కదిలేదని ఆయన అన్నారు. తన తండ్రి చంద్రబాబు దీక్షకు వచ్చిన స్పందనను చూడలేకే ఆంధ్రభవన్ రెసిడెంట్ కమిషనర్ ఇక్కడి నుంచి పంపించే యత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

చంద్రబాబు తన తదీక్ష ద్వారా కేవలం 24 గంటల్లోనే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారని ఆయన అన్నారు. అనుమతి లేకుండా దీక్ష చేపట్టిన చంద్రబాబును ఖాళీ చేయాలని ఆంధ్ర భవన్ రెసిడెంట్ కమిషనర్ మంగళవారం ఉదయం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

కిరణ్‌ను అరెస్టు చేయాలి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే పీడి యాక్టు కింద అరెస్టు చేయాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరగొనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలని ఆయన కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని కోరారు.

శాంతిభద్రతలు పరిరక్షించడంలో విఫలం కావడంతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే డిస్మిస్ చేయాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రదేశ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజనపై మళ్లీ అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలనేది పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+