Nara Lokesh : రోజా అడ్డాలోకి ఎంటరైన నారా లోకేష్ ! పంచ్ లు మొదలు-కౌంటర్లూ రెడీ..!
ఏపీలో చంద్రబాబు, లోకేష్ ను నిత్యం టార్గెట్ చేసే వైసీపీ మంత్రుల్లో ఆర్కే రోజా ముందువరుసలో ఉంటారు. ఈ నేపథ్యంలోఆమె నియోజకవర్గంలో పాదయాత్రతో ప్రవేశించిన నారా లోకేష్ .. పంచ్ లకు సిద్ధమయ్యారు.
ఏపీలో టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది. నిన్నటి వరకూ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు (జీడీ నెల్లూరు)నియోజకవర్గంలో సాగిన లోకేష్ పాదయాత్ర.. రాత్రి అదే జిల్లాలోని నగరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. దీంతో మంత్రి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో లోకేష్ చేయబోతున్న పాదయాత్రలో ఆమెను ఎలా టార్గెట్ చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ సాయంత్రం నియోజకవర్గంలోని చినరామకుప్పంలో సాయంత్రం లోకేష్ బహిరంగసభ ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు దీనికి అనుమతి ఇస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిన్న 17వ రోజు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కొత్తూరు నుంచి నగరి నియోజకవర్గం చినరాజకుప్పం వరకు 17.7 కిలోమీటర్ల మేర సాగింది. ఈ సందర్భంగా పోలీసుల అడ్డంకులపై లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టూల్ తీసేస్తే ఇల్లు ఎక్కి మాట్లాడతా, అదీ కుదరకపోతే మా నాయకుల భుజాలపై ఎక్కి మాట్లాడతా, చైతన్యం తీసుకువస్తున్నాను కాబట్టే అడ్డంకులు సృష్టిస్తున్నారు. అయినా పర్వాలేదు పోరాడుతా. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధరలు పెరగలేదు. ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు. ఉద్యోగాలు వచ్చాయి." అని నారా లోకేశ్ అన్నారు.

సీఎం జగన్ వ్యవస్థలంటినీ ధ్వంసం చేశారని, రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాటం చేసి వైఎస్సార్సీపీ సర్కార్‌ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. 18వ రోజున చినరాజకుప్పం నుంచి యాత్ర ప్రారంభించిన లోకేశ్.. పుత్తూరు బహిరంగసభలో పాల్గొంటారు. మంత్రి రోజా నియోజకవర్గంలో లోకేష్ ఏర్పాటు చేస్తున్న బహిరంగసభలో ఆయన ఏం వ్యాఖ్యలు చేస్తారన్న దానిపై టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. అలాగే లోకేష్ ఏదైనా మాట్లాడితే రోజా కూడా తనదైన శైలిలో కౌంటర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
రోజా అడ్డాలోకి ఎంటరైన నారా లోకేష్ ! పంచ్ లు మొదలు-కౌంటర్లూ రెడీ..!!#NaraLokesh #MLARoja #RojaSelvamani #Yuvagalam #NaraLokeshPadayatra #Oneindiatelugu pic.twitter.com/DZ1Lvb5OwF
— oneindiatelugu (@oneindiatelugu) February 13, 2023












Click it and Unblock the Notifications